Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సెంచరీ దిశగా కబీర్ సింగ్.. మూడు రోజుల్లోనే లాభాల్లోకి.. ఎంత వసూలంటే!
అర్జున్‌రెడ్డి రీమేక్‌గా బాలీవుడ్లో రిలీజైన కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. గత మూడు రోజులుగా భారీ కలెక్షన్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల కంటే ఎక్కువగా వసూళ్లను సాధిస్తుండటం గమనార్హం. సల్మాన్ ఖాన్ నటించిన భారత్, తాప్సీ పన్ను మూవీ గేమ్ ఓవర్, హలీవుడ్ చిత్రం మెన్ ఇన్ బ్లాక్ చిత్రాల కంటే భారీగా కలెక్షన్లను రాబడుతుండటం విశేషం. గత మూడు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే...
బాక్సాఫీస్ వద్ద కబీర్ సింగ్ మ్యాజిక్
ప్రస్తుత ఏడాదిలో రిలీజైన కొన్ని చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డులను కబీర్ సింగ్ దాటేసింది. 3700 స్క్రీన్లలో రిలీజై 62.40 కోట్లు వసూలు చేసిన టోటల్ ధమాల్ చిత్రం వసూళ్లను అధిగమించింది. నాన్ హాలీడే చిత్రంగా రిలీజై కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నది అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా కబీర్ సింగ్ చిత్రం 3123 స్క్రీన్లలో రిలీజైన విషయం తెలిసిందే.
ఆదివారం భారీగా వసూళ్లు
బాక్సాఫీస్ వద్ద కబీర్ సింగ్ మెరుపులు మెరిపిస్తున్నది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్, సింగిల్ థియేటర్లు అనే తేడా లేకుండా భారీ కలెక్షన్లు నమోదవుతున్నాయి. కబీర్ సింగ్ తొలి రోజున 20.21 కోట్లు, శనివారం రూ.22.71 కోట్లు, ఆదివారం 27.91 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం రూ.70.83 కోట్ల వసూళ్లను సాధించింది అని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ మరో ట్వీట్ చేశారు.
రూ.60 కోట్ల బడ్జెట్‌తో
తెలుగులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన అర్జున్ రెడ్డి ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రం ఆధారంగా కబీర్ సింగ్ దాదాపు రూ.60 కోట్లతో తెరకెక్కించారు. గడిచిన మూడు రోజుల్లోనే రూ.70 కోట్లకుపైగా రాబట్టడంతో సినిమాను హిట్ జాబితాలోకి చేర్చారు. వారాంతం తర్వాత కబీర్ సింగ్ ఎలాంటి వసూళ్లను సాధిస్తుందనే ప్రతిపాదికపైనే బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ టాక్‌లను సొంతం చేసుకొనే విషయంపై అభిప్రాయాలు వ్యక్తమవుతాయి.
షాహీద్ కపూర్ కెరీర్లోనే అత్యధికంగా
బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ నిలిచిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గేమ్ ఓవర్, భారత్ చిత్రాల నుంచి పెద్దగా ముప్పేమీ ఉండకపోవచ్చు. వచ్చే వారం రిలీజ్ కానున్న ఆయుష్మాన్ ఖురానా 15 చిత్రం రిలీజ్ కానున్నది. ఆ సినిమా పరిస్థితిని బట్టి కబీర్ సింగ్ సినిమా వసూళ్లు ఆధారపడి ఉంటాయి అనేది ట్రేడ్ వర్గాల సమాచారం.