200 కోట్లకు చేరువలో కబీర్ సింగ్.. క్రిటిక్స్‌కు చెంపపెట్టులా కలెక్షన్లు

బాలీవుడ్ తారలు షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన కబీర్ సింగ్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఎదురు లేకుండా సాగిపోతున్నది. రిలీజ్ తర్వాత రెండో శనివారం ఈ చిత్రం రూ.160 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం 11.50 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం 143 వద్ద స్థిరపడింది. ఇదే దూకుడుతో రూ.200 కోట్ల క్లబ్‌ వైపు పరుగులు పెడుతున్నది.

రెండో శనివారం అనూహ్యంగా రూ.16.25 కోట్లు వసూలు చేయడం ద్వారా ఈ చిత్రం రూ.160 కోట్లకు చేరువైంది. ఆదివారం రూ.175 కోట్లు దాటే అవకాశం ఉంది. 2019లో బాలీవుడ్‌కు ఇదే అత్యధిక వసూళ్లు. కేసరి, టోటల్ ఢమాల్ సినిమాల కలెక్షన్లను అధిగమించింది. ఈ ఏడాది టాప్ 3 స్థానంలో నిలిచింది. భారత్, యూరీ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.

Kabir Singh racing towards 200 crores club

సందీప్ రెడ్డి తన మొదటి చిత్రంతోనే సత్తా చాటుతున్నాడు. తన చిత్రాన్ని రూ.200 కోట్ల క్లబ్‌లో చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. కబీర్ సింగ్ సినిమాకు రెండో వారంలో కూడా ఆదరణ తగ్గలేదు. రెండో వారంలో కూడా ఈ సినిమాకు పోటీ లేకపోవడం వల్ల కబీర్ సింగ్ మరింత వసూళ్లను ఖాతాలో వేసుకొనే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబీర్ సింగ్ చిత్రంపై సినీ విమర్శకులు పెదవి విరిచారు. ముద్దులు ఏంటీ, డ్రగ్స్, మితీమీరిన శృంగారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సినీ విమర్శకుల చెంపపెట్టుగా ప్రేక్షకులు కబీర్ సింగ్‌ను ఆదరించడం విశేషం. యూత్ ఆడియెన్స్‌ మెడికల్ స్టూడెంట్ ప్రేమకథకు మరోసారి జై కొట్టడంతో కబీర్ సింగ్ భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X