twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూఎస్ఏ రిపోర్ట్: ‘అర్జున్ రెడ్డి’ రికార్డ్ బద్దలు కొట్టే దిశగా ‘కబీర్ సింగ్’

    |

    షాహిద్ కపూర్ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'కబీర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఇండియాలో రూ. 200 కోట్ల మార్కును క్రాస్ అయిన ఈ చిత్రం యూఎస్ఏలో సైతం కాసుల పంటపండిస్తోంది. తెలుగులో హిట్ మూవీ 'అర్జున్ రెడ్డి' రీమేక్‌గా రూపొందిన ఈ కల్ట్ మూవీ త్వరలోనే యూఎస్ఏలో ఒరిజినల్ వెర్సన్ లైఫ్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు.

    'కబీర్ సింగ్' చిత్రం తొలివారం యూఎస్ఏలో $1,124,937 వసూలు చేసింది. గతంలో తెలుగు వెర్షన్ చూసిన వారు సైతం ఈ రీమేక్ వెర్షన్లో షాహిద్ ఎలా చేశాడో వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కల్కి, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలు విడుదలవ్వడంతో రెండో వారంలో 'కబీర్ సింగ్ వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టాయి.

    Kabir Singh USA second weekend collections

    సెకండ్ వీకెండ్ ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద $465,934 వసూలు చేసింది. దీంతో 10 డేస్ టోటల్ $1.59 మిలియన్ రీచ్ అయింది. ఫుల్ రన్‌లో ఈ మూవీ 2 మిలియన్ మార్క్ అందుకుంటుందా? లేదా? అనేది ఆసక్తిరంగా మారింది.

    ఒరిజినల్ వెర్షన్ 'అర్జున్ రెడ్డి' బాక్సాఫీస్ వద్ద లైఫ్ టైమ్ రన్‌లో $1.78 మిలియన్ వసూలు చేసింది. త్వరలోనే 'కబీర్ సింగ్' ఈ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్ ఇద్దరి పెర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తే ఎవరి స్టైల్‌లో వారు అద్భుతంగా చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    మరో వైపు తమిళంలో కూడా ఈ చిత్రం రీమేక్ అవుతోంది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఆదిత్య వర్మ' టైటిల్ ఫైనల్ చేశారు. సందీప్ వంగా దగ్గర అసిస్టెంటుగా పని చేసిన గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు.

    English summary
    Kabir Singh opened to fantastic response and collected $1,124,937 at the US box office in the first week. The movie has collected $465,934 at the US box office in the second weekend, taking its 10-day total to $1,590,871.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X