Kabzaa day 1 Collections ఉపేంద్ర కెరీర్‌లోనే ది బెస్ట్ ఒపెనింగ్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
భారీ బడ్జెట్‌తో రూపొందిన కబ్జ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉపేంద్ర, సుదీప్ కిచ్చ, శివరాజ్ కుమార్, శ్రీయసరన్ లాంటి అగ్ర నటులు నటించిన ఈ చిత్రం మార్చి 17వ తేదీన విడుదలైంది. ఆర్ చంద్రూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హై స్టాండర్స్‌తో తెరకెక్కింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తొలి రోజు ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే?
అత్యున్నత సాంకేతిక విలువలు, ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టార్ హీరో, హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్‌తో వచ్చిన కబ్జ చిత్రం తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను కూడగట్టుకొంటున్నది. తొలి రోజు కన్నడలో మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసింది. అలాగే తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా నమోదైంది.

హిందీలో రికార్డు థియేటర్లలో
కన్నడ భాషలో పవర్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన కబ్జా చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజైంది. నిర్మాత ఆనంద్ పండిట్ ఈ సినిమాను రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. ఉత్తరాదిలో ఈ సినిమాను 1604 థియేటర్లలో రిలీజ్ చేశారు. హిందీ వెర్షన్‌కు భారీ స్పందన లభిస్తున్నది.

ఇండియావైడ్ కలెక్షన్లు
కన్నడలో కబ్జ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా మార్నింగ్ షోకు 44 శాతం, మ్యాట్నీకి 40 శాతం, ఫస్ట్ షోకు 43 శాతం, సెకండ్ షోకు 65 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉత్తరాదిలో 15 శాతం నమోదైంది. తమిళంలో 15 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

తొలి రోజు కబ్జ కలెక్షన్లు ఎంతంటే?
ఇక కబ్జ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. పలు ప్రాంతాల్లో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఉపేంద్ర స్టార్ వాల్యూకు తగినట్టుగా ఈ సినిమా వసూళ్లను నమోదు చేసింది. కర్ణాటకలో 8 కోట్ల గ్రాస్, తెలుగులో 1.5 కోట్ల గ్రాస్, హిందీలో 1.2 కోట్లు, మలయాళంలో 15 లక్షలు, తమిళంలో 25 లక్షల వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే?
కబ్జ చిత్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజున ఇండియాలో దాదాపు 12 కోట్ల వసూళ్లను రాబట్టింది. అమెరికాలో ఈ చిత్రం 16 లక్షలు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 26 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఉపేంద్ర నటించిన చిత్రాల్లో, ఆయన కెరీర్‌లో అత్యున్నత కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఈ చిత్రం రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











