Kabzaa day 2 expected Collections 50 కోట్ల మార్కు వైపు కబ్జ పరుగు.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?
కన్నడ సూపర్ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చ సుదీప, శివ రాజ్ కుమార్, శ్రీయా సరన్ కలిసి నటించిన చిత్రం కబ్జ. ఈ చిత్రం కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో దేశవ్యాప్తంగా రిలీజైంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సాధిస్తుందనే విషయంలోకి వెళితే..

120 కోట్ల బడ్జెట్‌తో
కబ్జ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ అంటే సుమారు 120 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. అంతే కాకుండా ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఇక సినిమాను హిందీలో 1600 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 3000 లకుపైగా స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత ఈ రేంజ్‌లో ప్రదర్శిస్తున్న కన్నడ చిత్రంగా రికార్డుకెక్కింది.

కబ్జ తొలి రోజు కలెక్షన్లు
ఇక కబ్జ చిత్రం తొలి రోజున భారీగానే కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కన్నడలో 8 కోట్ల వరకు, అలాగే తెలుగు రాష్ట్రాలో 1.45 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల వరకు, హిందీలో 60 లక్షల వరకు వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 12.65 కోట్ల వసూళ్లను ఇండియాలో, ఓవర్సీస్ కలుపుకొని దాదాపు 28 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

రెండో రోజు కబ్జ ఆక్యుపెన్సీ
కబ్జ చిత్రం రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. కన్నడలో ఈ చిత్రం దాదాపు 36 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయగా, తెలుగులో దాదాపు 25 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శించబడింది. హిందీలో ఈ సినిమాకు పెద్దగా స్పందన రావడం లేదు. ఉత్తరాదిలో ఈ సినిమా 15 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కబ్జా రెండో రోజు కలెక్షన్ల అంచనా
కబ్జా చిత్రం రెండో రోజు బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. ఇండియాలో భారీగానే వసూళ్లు నమోదు చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తొలి రోజు కంటే కాస్త తక్కువగానే అంటే ఇండియాలో అన్ని భాషల్లో సుమారు 8 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టవచ్చనే అంచనాను ట్రేడ్ వర్గాలు వేశాయి.

కబ్జా ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు
కబ్జ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇండియాలో 8 కోట్లు, ఓవర్సీస్‌లో దాదాపు 4 కోట్లతో మొత్తంగా 12 కోట్ల షేర్.. 20 కోట్ల గ్రాస్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. తొలి రోజు 26 కోట్లు, రెండో రోజు 20 కోట్ల గ్రాస్‌తో 50 కోట్లకు చేరువ కావోచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











