Kabzaa day 3 Collections బాక్సాఫీస్ కబ్జ.. 100 కోట్ల క్లబ్‌లో ఉపేంద్ర.. సోషల్ మీడియాలో భారీ రచ్చ!
కన్నడ సూపర్ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చ సుదీప, శివ రాజ్ కుమార్, శ్రీయా సరన్ కలయికలో దర్శకుడు ఆర్ చంద్రూ రూపొందించిన చిత్రం కబ్జ. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో ఈ చిత్రం మార్చి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టెక్నికల్ పరంగా రిచ్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారుగా కాసులు పంట పడిస్తున్నది. ఈ సినిమా 3వ రోజు సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్‌తో కబ్జా
కన్నడ సినీ పరిశ్రమలో కబ్జ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ అంటే సుమారు 120 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.ఈ సినిమా ట్రైలర్లు, టీజర్లు క్రేజ్ పెంచడంతో భారీగా బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమాను రికార్డు స్థాయిలో హిందీలో 1600 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 3000 లకుపైగా స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.

కబ్జ తొలి రోజు కలెక్షన్లు
కబ్జ చిత్రం తొలి రోజున భారీగానే ఒపెనింగ్స్ సాధించింది. కర్ణాటకలో 8.2 కోట్లు, తెలుగులో 1.2 కోట్లు, హిందీలో 70 లక్షలు, తమిళంలో 15 కోట్లు సాధించింది. మలయాళంలో 10 లక్షలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా 10.35 కోట్లు రాబట్టింది. ఇండియాలో వైడ్‌గా మంచి కలెక్షన్లను నమోదు చేసింది.

కబ్జ చిత్రం రెండో రోజు ఎంతంటే?
కబ్జ చిత్రం రెండో రోజు కలెక్షన్లు విషయానికి వస్తే. ఈ చిత్రం కర్ణాటకలో 4.45 కోట్లు, తెలుగులో 45 లక్షలు, హిందీలో 65 లక్షలు, తమిళంలో 15 లక్షలు, మలయాళంలో 5 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం అన్ని భాషల్లో 5.75 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే తొలి రోజు కంటే 44 శాతం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.

మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.
ఇక కబ్జా చిత్రం మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా దేశవ్యాప్తంగా 37 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఆదివారం కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాంతో ఈ సినిమా 4 నుంచి 5 కోట్ల మేర వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

మూడు రోజుల మొత్తం కబ్జ కలెక్షన్లు
అయితే కబ్జా చిత్రం ఇండియావైడ్‌గా మూడు రోజుల తర్వాత బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. తొలి రోజు 10.35 కోట్లు, రెండో రోజు 5.75 కోట్లు, మూడో రోజు 5 కోట్లు సాధిస్తే.. ఈ చిత్రం 21 కోట్లు షేర్ సాధించినట్టు అవుతుంది. ఓవర్సీస్‌లో ఎంత వసూలు చేసిందనే విషయాలు అందుబాటులోకి రాలేదు.

100 కోట్ల పోస్టర్‌పై అనుమానాలు
కానీ కబ్జ చిత్రం టీమ్ మాత్రం ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దాంతో సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఈ చిత్రం ఏ రకంగా 100 కోట్లు రాబట్టిందనే విషయంపై అనుమానంగా మారింది. ఈ లెక్కలు నిజమేనా? లేదా ఫ్యాన్స్ చేసిన పోస్టరా? అనే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.


Click it and Unblock the Notifications











