Kadhalikka Neramillai: షాకింగ్‌గా కాదలిక్క నెరమిల్లై కలెక్షన్లు.. నిత్యమీనన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

తమిళంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా కిరుతిక ఉదయనిధి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కాదలిక్క నెరమిల్లై. ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో రవి మోహన్ (జయం రవి), నిత్య మీనన్ జంటగా, యోగిబాబు, వినయ్ రాయ్, జాన్ కొక్కెయ్, లాల్ తదితరులు నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? నమోదు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కాదలిక్క నెరమిల్లై సినిమా కథ విషయానికి వస్తే.. చెన్నైకి చెందిన శ్రీయ (నిత్యమీనన్) ఆర్కిటెక్ట్. లవ్ బ్రేకప్‌తో ఒంటరిగా జీవితాన్ని గడుపుతుంటుంది. అయితే ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చి సింగిల్ పేరెంట్‌గా జీవించాలని అనుకొంటుంది. ఇక బెంగళూరుకు చెందిన ఇంజినీర్ సిద్దార్థ్ (రవి మోహన్) ప్రియురాలి చేతిలొ మోసపోయి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంటాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన పరిచయం బలమైన బంధంగా మారుస్తుంది. అయితే ఈ రిలేషన్‌షిప్‌తో వారి డెస్టినీ ఎటువైపు వెళ్లిందనేది ఈ సినిమా కథ.

Kadhalikka Neramillai Day 1 Box Office Collections Worldwide

ఏఆర్ రెహ్మన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేయడం, అలాగే రవి, నిత్య, యోగిబాబు లాంటి టాప్ యాక్టర్లు ఈ సినిమాలో భాగం కావడంతో రాజీ పడుకుండా సినిమాను నిర్మించారు. ఈ సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రమోషనల్ వ్యయం అంతా కలిపి సుమారుగా 20 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

నిత్యా మీనన్ నటించిన ఈ సినిమా ప్రమోషన్స్‌కు మంచి రెస్సాన్స్ రావడంతో భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 18 కోట్ల మేర రైట్స్ అమ్మకాలు జరిగాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమాపై భారీగా క్రేజ్ కూడా ఉండటంతో ఈ చిత్రాన్ని మెజారిటీగా తమిళనాడులో, ఇతర ప్రాంతాల్లో సుమారుగా 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ పెరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Kadhalikka Neramillai Day 1 Box Office Collections Worldwide

కాదలిక్క నెరమిల్లై సినిమా తమిళనాడులో గ్రాండ్‌గానే బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. కానీ దక్షిణాదిలో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ సినిమాకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. తమిళనాడులో ఈ సినిమా తొలి రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా 50 లక్షల రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా కలెక్షన్లు వెల్లడి కావాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కాదలిక్క నెరమిల్లై సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం నామమాత్రంగానే ఉంది. ఈ సినిమా వసూళ్లు ఊపందుకొంటే.. తొలివారంలోనే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 20 కోట్ల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X