KNPH Collections: హృతిక్ మూవీకి ముఖం చాటేసిన ప్రేక్షకులు, పేలవంగా కహోనా ప్యార్ హై కలెక్షన్లు.. ఎన్ని లక్షలంటే?
ఇండియన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కథానాయకుడిగా పరిచయమై రూపొందిన చిత్రం కహోనా ప్యార్ హై చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. తండ్రి రాకేశ్ రోషన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. హృతిక్ రోషన్‌కు మహిళా లోకం ఫిదా అయింది. ఈ సినిమా ద్వారా అమీషా పటేల్ హిందీ సినిమా రంగానికి పరిచయమైంది. అయితే ఈ సినిమాను ఇటీవల రీ రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఫస్ట్ టైమ్ రిలీజ్ చేసినప్పుడు కలెక్షన్లు ఎంత వసూలు చేసింది? రీ రిలీజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావం చూపించిందనే వివరాల్లోకి వెళితే..
కహోనా ప్యార్ హై సినిమాలో అనుపమ్ ఖేర్, దలీప్ తాహిల్, మోహనీష్ బెహల్, ఆశీష్ విద్యార్థి, సతీష్ షా, ఫరీదా జలాల్ తదితరులు నటించారు. ఈ సినిమా కోసం టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమాను విదేశాల్లో ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా వ్యయం 2000 సంవత్సరంలో సుమారుగా 10 కోట్ల రూపాయలుగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కహోనా ప్యార్ హై సినిమా తొలి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో సంచలనం రేపింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 45 కోట్ల రూపాయలు నికరంగా, 74 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 6 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇంతటి ఘన విజయం సాధించిన కహోనా ప్యార్ హై సినిమాను మరోసారి రిలీజ్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండటంతో భారీగా ప్రమోషన్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అమీషా పటేల్ థియేటర్‌కు వెళ్లి అభిమానులతో సందడి చేస్తూ డ్యాన్సులతో హోరెత్తించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయింది. భారీగా థియేటర్లకు రప్పించలేకపోవడంతో పేలవంగా వసూళ్లు నమోదు అయ్యాయి.

కహోనా ప్యార్ హై సినిమా రీ రిలీజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మూడు, నాలుగు రోజుల్లో పరిమితంగా ప్రదర్శించిన ఈ మూవీకి కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు అయ్యాయి. చాలా చోట్ల ప్రేక్షకులు లేకపోవడంతో పలు చోట్ల సినిమా ప్రదర్శనలను రద్దు చేశారనే వార్తలు వచ్చాయి. దాంతో ఈ సినిమా లైఫ్ టైమ్‌లో 45 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











