హీరోయిన్ కాజల్ పిచ్చెక్కిస్తా (ఫోటోస్)
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ 'పిచ్చెక్కిస్తా' ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సీడీలు ఆవిష్కరించారు. ఎన్.కె, హరిణి జంటగా బి.శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మిర్రర్ మీడియా సమర్పణలో 7ఆర్ట్స్- మానస ఫిలింస్ పతాకంపై నటరాజ్ కొట్టూరి, రాజశేఖర్ లంకా, శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నవనీత్ చారి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్య్వూ థియేటర్ లో జరిగింది. కాజల్ తొలి సీడీ ఆవిష్కరించి దర్శకుడు మారుతికి అందించారు.
స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన వివరాలు, ఫోటోలు....

కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ...
నా దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. సినిమా ఏదైనా కష్టపడటం మీదే ఫలితం ఆధార పడి ఉంటుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

స్టోరీ గురించి దర్శకుడు మాట్లాడుతూ
''ఓ అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయి వెంటపడి, తనను ప్రేమించమని అడుగుతుంటాడు. ఆ అబ్బాయి ప్రేమను అంగీకరించిన ఆ అమ్మాయి ఓ ట్విస్ట్ ఇస్తుంది. చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ ఇదని చెప్పుకొచ్చారు.

ఎన్.కె హీరోగా పరిచయం
ఈ చిత్రం ద్వారా ఎన్.కె హీరోగా పరిచయం అవుతున్నాడు. తను చాలా ఈజ్ తో ఈ సినిమా చేసాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని దర్శకుడు తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్
సంగీత దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ - ''డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి నాకు చిన్ననాటి మిత్రుడు. తను అనుకున్న కాన్సెఫ్ట్ కి సరిపడా పాటలను సమకూర్చడం జరిగింది. పాటలు అందరినీమెప్పిస్తాయని ఆశిస్తున్నాను' అన్నారు.

హీరో ఎన్.కె
హీరో ఎన్.కె మాట్లాడుతూ 'హీరోగా నా తొలి చిత్రం ఇది. అయినా సరే పది సినిమాల్లో నటించిన ఎక్స్ పీరియన్స్ ఈ చిత్రం ద్వారా వచ్చిందని తెలిపారు.

విడుదల తేదీ
‘పిచ్చెక్కిస్తా' చిత్రాన్ని సెప్టెంబర్ 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు.

నటీనటులు
ఎన్.కె, హరిణి, ఫణిరాజ్, కోమల్, శ్రీ, ఇంటూరి వాసు తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: రాము.జి., సంగీతం: నవనీత్ చారి, రచన, నిర్మాత, దర్శకత్వం: శ్రీకాంత్ రెడ్డి.


Click it and Unblock the Notifications











