అఖిల్ బ్యాటింగ్ పైనే కాజల్ మోజు
అక్కినేని అఖిల్ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం అంటోంది కాజల్ అగర్వాల్. ఆమె సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కి ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం షార్జాలో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ హ్యాపీగా గడుపుతోంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పదించింది. అలాగే..మైదానంలో గెలుపు కోసం పోరాటం చేసేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. వారిని చూస్తూ ఎంతో స్ఫూర్తి పొందవచ్చు. ఇక నా మద్దతు ఈ జట్టులన్నిటిలోనూ..నిస్సందేహంగా తెలుగు వారియర్స్‌కే. హిందీలోనూ ఓ సినిమా చేశా. కానీ నాకు అవకాశాల్ని ఇచ్చిందీ, నటిగా గుర్తింపును తెచ్చింది తెలుగు పరిశ్రమే. అందుకే మన తెలుగు హీరోలకే మద్దతు ఇస్తా అని చెప్పింది. ఇక ఫలితం గంటల్లో తేలిపోయే పోటీలివి. నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి. తక్కువ తప్పులు చేసేవారే గెలుస్తారు. ఎవరు గెలిచినా, మరెవరు ఓడినా... వినోదానికి ఢోకా ఉండదు. మొత్తం సినీ పరిశ్రమని ఒకే గొడుగు కిందకి తీసుకురావడం చాలా మంచి ఆలోచన. అందరి ఆట తీరునీ గమనిస్తున్నా అని చెప్పింది.
మరి హీరోయిన్స్ తో ఓ జట్టు రూపొందిస్తే మీరు ఆడతారా అని అడిగితే అమ్మో... ఆటలంటే మాటలు కాదు. మైదానంలో ఉరుకులు, పరుగులు నా వల్లకాదు. కావాలంటే గ్యాలరీలో కూర్చుని గోల చేస్తా అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ నటించిన బిజినెస్ మ్యాన్ సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆమె ఆ ఉషారులో ఉంది.


Click it and Unblock the Notifications











