Satyabhama 2 Days Collections: కాజల్ మూవీకి షాక్.. తొలి రోజు వచ్చింది ఇంతే.. అసలు ఎంత రావాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. అందులో కొందరు మాత్రమే సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. అప్పుడు వరుస చిత్రాలతో సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కూడా అదే ఊపు కంటిన్యూ చేస్తోంది. ఇలా తాజాగా 'సత్యభామ' అనే చిత్రంతో వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కాజల్ 'సత్యభామ' మూవీ రెండు రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
సత్యభామగా మారిన కాజల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా సినిమానే 'సత్యభామ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీని సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క నిర్మించారు. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చారు.

కాజల్ సినిమాకు బిజినెస్
ఈ మధ్యన వరుస చిత్రాలతో దూసుకెళ్తోన్న కాజల్ అగర్వాల్ నటించిన సినిమానే 'సత్యభామ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 3.00 కోట్లు వరకూ బిజినెస్ చేసుకుంది.
రెండో రోజు కూడా అంతే
సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన 'సత్యభామ' సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. రెండో రోజు కూడా అదే ట్రెండ్ చూపించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 30 లక్షలు, వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 35 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇలా రెండు రోజుల్లో రూ. 70 లక్షలు రాబట్టింది.


Click it and Unblock the Notifications











