Satyabhama 4 Days Collections: కాజల్ సినిమాకు షాకింగ్ కలెక్షన్లు.. ఇంకెంత వస్తే సత్యభామ హిట్ అంటే!
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా ప్రభావాన్ని చూపిస్తూ.. ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు దూసుకుపోతోంది చందమామ కాజల్ అగర్వాల్. ఇప్పటి వరకూ హీరోలతో కలిసి హిట్లు అందుకున్న ఈ భామ.. ఇప్పుడు సోలో సక్సెస్ కోసం 'సత్యభామ' అనే సినిమాలో నటించింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో ఇటీవలే విడుదల అయింది. దీనికి ఆశించిన రీతిలో టాక్ రాకపోవడంతో రెస్పాన్స్ అంతగా లభించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ 'సత్యభామ' మూవీ నాలుగు రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
సత్యభామగా కాజల్ ఎంట్రీ
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించిన తాజా సినిమానే 'సత్యభామ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీని సుమన్ చిక్కాల తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క నిర్మించారు. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

కాజల్ సినిమాకు బిజినెస్
సెకెండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న కాజల్ అగర్వాల్ నటించిన చిత్రమే 'సత్యభామ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 1.80 కోట్లు వరకూ బిజినెస్ చేసుకుంది.
నాలుగో రోజు కూడా అంతే
సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన 'సత్యభామ' సినిమాకు మిక్స్ టాక్ రాకపోవడంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. తర్వాత కూడా పెద్దగా రాణించడం లేదు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో ఈ చిత్రం రూ. 87 లక్షలు, వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 99 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











