Satyabhama Day 1 Collections: కాజల్ మూవీకి షాక్.. తొలి రోజు వచ్చింది ఇంతే.. అసలు ఎంత రావాలంటే!

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్లుగా దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌దే. అందం, అభినయంతో ఓ రేంజ్‌లో అలరిస్తోన్న ఈ చిన్నది.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుసగా సినిమాలు మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.

ఇలా ఇప్పుడు 'సత్యభామ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు డీసెంట్ టాక్ వచ్చినా రెస్పాన్స్ ఆశించిన రీతిలో రాలేదు. మరి 'సత్యభామ' మూవీ మొదటి రోజు ఎంత రాబట్టిందో మీరే చూడండి!

Kajal Aggarwal Starrer Satyabhama Movie Day 1 Worldwide Collections Details

సత్యభామగా వచ్చిన కాజల్
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన తాజా సినిమానే 'సత్యభామ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీని సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క నిర్మించారు. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం ఇచ్చారు.

కాజల్ సినిమాకు బిజినెస్
సెకెండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోన్న కాజల్ అగర్వాల్ నటించిన సినిమానే 'సత్యభామ'. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 3.00 కోట్లు వరకూ బిజినెస్ జరుపుకుంది.

Kajal Aggarwal Starrer Satyabhama Movie Day 1 Worldwide Collections Details

మిక్స్‌డ్ టాక్‌తో తక్కువగా
క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో రూపొందిన 'సత్యభామ' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే మిశ్రమంగా లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే కంటే తక్కువ వసూళ్లు వస్తాయని టాక్ వినిపించింది.

Kajal Aggarwal Starrer Satyabhama Movie Day 1 Worldwide Collections Details

మొదటి రోజు ఎంతంటే
సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన 'సత్యభామ' సినిమాకు మొదటి రోజు టాక్ అంతగా రాకపోవడంతో ప్రేక్షకులను రప్పించడంలో ఈ చిత్రం అంతగా సక్సెస్ కాలేదు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 35 లక్షలు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి ఈ సినిమా రూ. 40 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X