Maa Day 5 Box Office Collections: కాజోల్ మా సినిమా 5వ రోజు కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ అగర్వాల్ తాజాగా నటించిన చిత్రం 'మా'. ఈ సినిమాకు విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. భారతీయ హిందీ భాషాలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథలాజికల్ హారర్ర్ ఫిల్మ్ గా విడుదలైంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్, కాజోల్ భర్త అజయ్ దేవ్‌గన్ నిర్మించడం విశేషం. మరోవైపు నిర్మాతలు జ్యోతి దేశ్‌పాండే, జియో స్టూడియోస్ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. కుమార్ మంగత్ పాఠక్ సహ నిర్మాతగా వ్యవహరించారు. సినిమాలో రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, గోపాల్ సింగ్, సూర్యశిఖా దాస్, యాని భరద్వాజ్, రూపకథ చక్రవర్తి వారు కీలక పాత్రలో పోషించారు. తొలిసారిగా కాజోల్ హార్రర్ ఫిల్మ్ లో నటించడం విశేషం. ఈ క్రమంలో సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 5వ రోజు బాక్సాఫీస్ వసూళ్ల వివరాల్లోకి వెళితే..

మా సినిమా బడ్జెట్ ఎంత?
నార్త్ ఇండియాతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రం విడైదలైంది. భారీ విజువల్స్ తో పాటు ప్రముఖ తారాగణం నటించడం, టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. దీంతో ఈ సినిమాకు భారీగానే ఖర్చైంది. సినిమా నిర్మాణ ఖర్చులు, నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలుపుకొని ఈ చిత్రానికి రూ. 65 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

Kajol Maa Movie Day 5 Box Office Collection

మా సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
కాజోల్ తొలి హార్రర్ సినిమా కావడం, పైగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నిర్మాతగా వ్యవహరించడంతో మా సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. మా సినిమాకు రూ.75 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించారు. ప్రస్తుతం థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం.

మా సినిమా 5రోజుల బాక్సాఫీస్ వసూళ్లు..
కాజోల్ మా చిత్రం బాక్సాఫీస్ వసూళ్లు అదిరిపోతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద సినిమాలేవీ లేకపోవడం, ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన కన్నప్ప కూ నార్త్ లో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో ఇక కాజోల్ మా చిత్రం దంచుకుంటోంది. మొదటి రోజు ఈ చిత్రానికి హిందీ నెట్ రూ.4.65 కోట్లు, 2వ రోజు రూ.6 కోట్లు, 3వ రోజు రూ.7కోట్లు, 4వ రోజు రూ.2.5 కోట్లు, 5వ రోజు రూ.2.85 కోట్లు కలెక్ట్ చేసింది.

దీంతో 5 రోజుల్లో ఈ చిత్రానికి రూ.23 కోట్ల వరకు హిందీ నెట్ వసూల్ కావడం విశేషం. ఇక ఇండియా గ్రాస్ రూ.23.9 కోట్లకు చేరుకుంది. మరోవైపు ఓవర్సీస్ లో రూ.3.8 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 5వ రోజు వరకు రూ.27.7కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే మరో 48 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాల్సిందే.

More from Filmibeat

Read more about: kajol maa box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X