Kalamkaval Day 1 Collections: కలాంకావల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. మమ్ముట్టి మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా జితిన్ కే జోస్ దర్వకత్వంలో తెరకెక్కిన మూవీ కలాంకావల్. మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై మమ్ముట్టి స్వయంగా నిర్మించారు. వినాయకన్, గిబిన్ గోపీనాథ్, రాజిషా విజయన్, గాయత్రి అరుణ్, శృతి రామచంద్రన్, బిజు పాప్పన్, ధన్య అనన్యలు కీలకపాత్రలు పోషించారు. జితిన్ జోస్, జిష్ణు శ్రీకుమార్‌లు ఈ సినిమాకు కథను అందించారు. ఫైజల్ అలీ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటర్‌గా సేవలందించారు. ముజీవ్ మాజీద్ సంగీత దర్శకత్వం వహించారు. డిసెంబర్ 5వ తేదీన కలాంకావల్ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మమ్ముట్టి నటించిన కలాంకావల్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు కలాంకావాల్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

కలాంకావల్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌‌, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కలాంకావల్ మూవీకి దాదాపు 29 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు మాలీవుడ్ వర్గాలు తెలిపాయి. త్రివేండ్రం, కొచ్చితో పాటు కేరళలోని అందమైన లోకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. కలాంకావల్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Kalamkaval Day 1 Expected Box Office Collections Worldwide Mammootty s Movie Good start at GBOC

గత కొంతకాలంగా మమ్ముట్టి తన స్థాయికి తగిన హిట్స్ అందుకోలేకపోతున్నారు. తన మిత్రుడు, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ భారీ హిట్స్ కొడుతూ దూసుకెళ్తుండగా మమ్ముట్టి మాత్రం నిరాశపరుస్తున్నాడు. ఆయన ఈ ఏడాది నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్, బజూకా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో కలాంకావల్‌పై మమ్ముట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

కలాంకావల్ అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్
టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలో కలాంకావల్ మూవీపై మంచి బజ్ నెలకొంది. దీనికి తగినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేశాడు మమ్ముట్టి. ప్రస్తుతం మాలీవుడ్‌లో ఎలాంటి సినిమా రిలీజ్‌లు లేకపోవడం మమ్ముట్టికి కలిసొచ్చే అంశం. తొలిరోజున కలాంకావల్ మూవీకి ఒక్క కేరళలోనే 1300కి పైగా షోలు పడినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. తద్వారా ప్రీ సేల్స్‌లో 1.25 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

టాప్‌లో మోహన్‌లాల్
తద్వారా అడ్వాన్స్ బుకింగ్ కింద మమ్ముట్టి సినిమాకు 2.25 కోట్ల రూపాయలు వసూలైనట్లుగా గణాంకాలు చెబుతున్నారు. తొలిరోజు కలాంకావల్ మూవీకి ప్రీ సేల్స్ కింద 2.50 టికెట్లు అమ్ముడవుతాయని భావిస్తున్నారు. మోహన్‌లాల్ నటించిన ఎల్ 2: ఎంపురాన్ మూవీ ఈ ఏడాది మాలీవుడ్‌లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఎక్కువ మొత్తం వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఎంపురాన్ ప్రీ సేల్స్‌లో 12.38 కోట్ల రూపాయలు రాబట్టగా.. ఆ తర్వాత తుడరుమ్ 2.35 కోట్ల రూపాయల గ్రాస్‌తో రెండో స్థానంలో నిలిచాయి.

కలాంకావల్ తొలిరోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో కలాంకావాల్ మూవీకి తొలిరోజున మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు మమ్ముట్టి మూవీకి 40.16 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఇప్పటి వరకు కొచ్చిలో 156 షోలు, త్రివేండ్రంలో 142 షోలు, బెంగళూరులో 96 షోలు, చెన్నైలో 91 షోలు ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ తెలిపింది. కడపటి వార్తలు అందేసరికి తొలిరోజున కలాంకావల్ మూవీకి ఇండియాలో 1.76 కోట్ల రూపాయల నికర వసూళ్లు నమోదయ్యాయి. తొలిరోజు ఇండియాలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున కలాంకావల్ మూవీ 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X