For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 ఏళ్ల కల చెదిరింది.. కరణ్‌ జోహర్‌కు భారీ దెబ్బ.. కళంక్ థియేటర్లన్నీ ఖాళీ.. ఎంత నష్టమంటే

|

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్, హై ప్రొఫైల్ యాక్టర్లతో రూపొందిన కళంక్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు చుక్కలు చూపించారు. ఇప్పటికే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ఫ్లాప్‌తో బేజారెత్తిన బాలీవుడ్‌కు కళంక్ రూపంలో మరో భారీ జట్కా తగిలింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం పేలవమైన ప్రదర్శన కారణంగా దారుణమైన వసూళ్లు నమోదవుతున్నాయి. అలియాభట్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా, మాధురి దీక్షిత్, సంజయ్ దత్ లాంటి అగ్ర తారలు నటించిన సినిమాను ప్రేక్షకులు తిరస్కరించడం ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...

15 ఏళ్ల నాటి డ్రీమ్ ప్రాజెక్ట్

కళంక్ సినిమాకు బాలీవుడ్‌లో ఓ ప్రత్యేకత ఉంది. కరణ్ జోహర్ తండ్రి యష్ జోహర్ డ్రీమ్ సినిమా ఇది. గతంలో ఈ సినిమాను నిర్మించాలనుకొన్న యష్.. కొన్ని కారణాల వల్ల ఈ కథను తెర మీదకు మలచలేకపోయారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ కథను తాజా పరిస్థితులు, టెక్నాలజీకి అనుగుణంగా కరణ్ జోహర్ తీర్చి దిద్దారు. దాంతో సినిమాపై అన్ని వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

మొదటి రోజు దండిగా వసూళ్లు

కళంక్ చిత్రం శుక్రవారం కాకుండా రెండు రోజుల ముందే అంటే ఏప్రిల్ 17నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు దండిగానే కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత ఏ రోజు కూడా వసూళ్ల వేగం పుంజుకోలేకపోయింది. గుడ్ ఫ్రైడే, హనుమాన్ జయంతి హాలీడేస్‌లో కూడా ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించలేకపోయింది.

చైనాలో వసూళ్ల సునామీ... రాధికా ఆప్టే, టబు సినిమా మ్యాజిక్.. కోట్ల కనక వర్షం

రూ.100 కోట్ల క్లబ్ వద్ద

దాంతో కళంక్ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు వసూళ్లను చూసి రూ.100 కోట్ల క్లబ్‌ను అవలీలగా దాటేస్తుందని అనుకొన్నారు. అయితే ఈ చిత్రం గత ఏడురోజుల్లో రూ.75 కోట్లు కూడా దాటకపోవడం ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేసింది. ఇక ఏ సినిమా సత్తాను పరీక్షించే తొలి సోమవారం రోజున కలెక్షన్లు క్షీణించడంతో కళంక్ కథ కంచికే అనే భావన వ్యక్తమవుతున్నది.

బాక్సాఫీస్ వద్ద 70 శాతం క్షీణత

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కళంక్ కలెక్షన్లు గత కొద్దిరోజులతో పోల్చుకొంటే 70 శాతం క్షీణించాయి. శనివారం రూ.9.75 కోట్లు, ఆదివారం రోజున ఈ చిత్రం 11.63 కోట్లు వసూలు చేశాయి. ఇక లిట్మస్ టెస్ట్‌గా భావించే సోమవారం ఈ చిత్రం కేవలం రూ.3.50 కోట్లను మాత్రమే వసూలు చేయడం గమనార్హం.

రూ.50 కోట్లకుపైనే నష్టం

కళంక్ చిత్రం దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. ఈ చిత్రం కనీసం రూ.100 కోట్లు దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఇక వచ్చే వారం బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఈ సినిమాకు ప్రధానంగా అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం నుంచి భారీ ముప్పు పొంచి ఉంది. అంతేకాకుండా మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానుండటం తెలిసిందే. దాంతో సుమారు రూ.50 కోట్లకుపైగానే నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నది.

English summary
Kalank is barely able to stand strong at the Box Office. Not only did the film witness 50% drop after day two, but it couldn't even hold on to collections on Monday. The movie collected Rs. 3.50 on Monday, after minting Rs. 11.63 crore on Sunday and Rs. 9.75 crore on Saturday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more