Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్లాప్ దిశగా భారీ బడ్జెట్ మూవీ! తొలి రోజు కలెక్షన్లు ఫుల్... తర్వాత డల్!
సంజయ్ దత్, మాధురి దీక్షిత్, వరుణ్ ధావన్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'కలంక్' బాక్సాఫీసు వద్ద వసూళ్లు లేక వెలవెల పోతోంది. రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల టాక్.
సినిమాపై ముందు నుంచి భారీ హైప్ ఉండటం, బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టెన్మెంట్స్ ఈ మూవీ వెనక ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా 5,300 థియేటర్లలో మహావీర్ జయంతి హాలిడే సందర్భంగా(ఏప్రిల్ 17) రిలీజ్ చేశారు.
ఓపెనింగ్స్ ఫుల్
అభిషేక్ వెర్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు ఇండియన్ బాక్సాపీసు వద్ద రూ. 21.60 కోట్లు వసూలు చేసి అదరగొట్టింది. అక్షయ్ కుమార్ ‘కేసరి' రికార్డును బీట్ చేస్తూ 2019లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
తర్వాత రోజు నుంచి డల్
అయితే తొలిరోజు మూవీ టాక్ ఆశింన స్థాయిలో లేక పోవడంతో తర్వాతి రోజు నుంచి వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. వారాంతమైన శనివారం అతి తక్కువగా రూ. 8.59 కోట్లు రాబట్టింది. దీంతో ఇండియన్ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం తొలి 4 రోజుల నెట్ కలెక్షన్ రూ. 53.15 కోట్లకు చేరుకుంది. డొమెస్టిక్ మార్కెట్లో టోటల్ గ్రాస్ రూ. 63.37 కోట్లకు రీచ్ అయింది.
ఓవర్సీస్ మార్కెట్లో ఒకే కానీ...
అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ‘కలంక్' వసూళ్లు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. తొలి 4 రోజుల్లో ఓవర్సీస్ గ్రాస్ రూ. 23.50 కోట్లు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టోటల్ రూ. 86.87 కోట్లు రాబట్టింది. బయటి దేశాల్లో వసూళ్లు బాగా ఉన్నప్పటికీ అవి లోకల్ మార్కెట్ నష్టాలను పూడ్చలేవు అంటున్నారు.
డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కడం కష్టమే
ఈ చిత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు రూ. 40 కోట్ల ఆదాయం తెచ్చిపెనట్లు తెలుస్తోంది. పరిస్థితి చూస్తుంటే వారు గట్టెక్కడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘కలంక్' చిత్రాన్ని కరణ్ జోహార్, సాజిద్ నడియావాలా, యష్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు.