Kalki 2898 AD Andhra, Nizam Collections 11 రోజు కొనసాగిన కల్కి కలెక్షన్ల వేట.. ప్రభాస్ మూవీ కుమ్ముడే కుమ్ముడు!

కల్కి 2898 ఏడీ చిత్రం వసూళ్ల వేట బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా రిలీజైన తర్వాత తొలి ఆట నుంచే అలసట లేకుండా.. వర్కింగ్ డే కానీ.. హాలీడే కానీ అనే సంబంధం లేకుండా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంది. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా గత 11 రోజులుగా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్, దిశా పటానీ నటించిన ఈ మూవీ 11వ రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

కల్కి మూవీ రిలీజ్ తర్వాత రెండో ఆదివారం రోజున భారీ ఆక్యుపెన్సీని రాబట్టింది. ఈ చిత్రం వరంగల్‌లో 80 శాతం, కరీంనగర్‌లో 77 శాతం,కాకినాడలో 77 శాతం, మహబూబ్ నగర్‌లో 70 శాతం, గుంటూరులో 62 శాతం, హైదరాబాద్‌లో 80 శాతం ఆక్యుపెన్సీని రాబట్టింది. దాంతో భారీగా కలెక్షన్లు నమోదు అయ్యాయి.

Kalki 2898 AD 2nd Weekend Collections Andhra and Nizam Prabhas movie Sets high revenue in telugu States

కల్కి 2898 ఏడీ మూవీ 11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్‌లో 1.25 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.35 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 70 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 53 లక్షలు, గుంటూరు జిల్లాలో 64 లక్షలు, కృష్ణా జిల్లాలో 80 లక్షలు, నెల్లూరులో 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో 11వ రోజున 10 కోట్లరూపాయలు నికరంగా, 15.5 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

గత 11 రోజుల్లో మొత్తంగా ఆంధ్రా, నైజాంలో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 80 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 19 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 19 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 11 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరిలో 8 కోట్లు, గుంటూరులో 10 కోట్లు, కృష్ణా జిల్లాలో 10 కోట్లు, నెల్లూరు జిల్లాలో 5.5 కోట్ల రూపాయల వసూలు చేసింది. దాంతో ఇప్పటి వరకు 163 కోట్లు నికరంగా, 252 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది.

Kalki 2898 AD 2nd Weekend Collections Andhra and Nizam Prabhas movie Sets high revenue in telugu States

ఇక ఈ మూవీకి సంబంధించి థియేట్రికల్ రైట్స్ భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా హక్కులు 170 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు విలువ కట్టారు. అయితే ఇప్పటి వరకు 163 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 7 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. దాంతో ఈ మూవీ లాభాల జోన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 11వ రోజు ఇండియాలో భారీగా కాసులు పంటను పండించింది. ఈ చిత్రం తెలుగులో 16.5 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, హిందీలో 22.5 కోట్లు, కన్నడలో 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 2 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండో వారాంతం రోజున 44.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 910 కోట్ల రూపాయలు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X