Kalki 2898 AD AP, Nizam Collections: తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల కలెక్షన్లు.. కల్కి లాభాల్లోకి రావాలంటే?
మహాభారతం బ్యాక్ డ్రాప్‌గా సైన్స్, ఫిక్షన్ నేపథ్యంగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 5 రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్నది. ఇక ఈ మూవీ 6 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రభాస్ నటించిన మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగింది. నైజాంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 65 కోట్ల రూపాయలుకు అమ్ముడుపోగా, ఆంధ్రాలోని అన్ని ఏరియా హక్కులు 103 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 168 కోట్లరూపాయల మేర బిజినెస్ జరిగింది.

కల్కి తొలి రోజు నుంచే భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఆంధ్రా, నైజాంలో ఈ సినిమా తొలి రోజు 45 కోట్ల రూపాయలు, రెండో రోజు 20 కోట్లు, మూడో రోజు 20 కోట్లు, నాలుగో రోజు 25.5 కోట్లు, 5వ రోజు 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత ఐదు రోజుల్లో 121 కోట్ల రూపాయలు నికరంగా, 189 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
కల్కి చిత్రం గత 5 రోజుల్లో నైజాంలో 60 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 14 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 14 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 8.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కోట్లు, గుంటూరులో 8 కోట్లు, కృష్ణా జిల్లాలో 7.5 కోట్లు, నెల్లూరులో 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 121 కోట్ల నికరంగా, 189కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఆంధ్రా, నైజాంలో 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 4.4 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 85 లక్షలు, ఉత్తరాంధ్రలో 85 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 47 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 లక్షలు, గుంటూరు 32 లక్షలు, కృష్ణా జిల్లాలో 40 లక్షలు, నెల్లూరు జిల్లాలో 25 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు 8 కోట్లు నికరంగా, 12 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో 170 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన కల్కి చిత్రం గత 6 రోజుల్లో 129 కోట్ల రూపాయలు నికరంగా, 201 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే.. కనీసం ఇంకా 40 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది. రెండో వారాంతంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











