Kalki 2898 AD Nizam, Andhra Collections: కల్కి కలెక్షన్ల ప్రభంజనం..సలార్ రికార్డు బ్రేక్.. 7 రోజుల్లో ఎన్ని

కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలను మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. నాగ్ అశ్విన్, ప్రబాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోను వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. అయితే గత 7 రోజుల్లో ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో కల్కి చిత్రం ఊహకు అందని విధంగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా గత 6 రోజుల్లో 64 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 15 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 15 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 9 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6.5 కోట్లు, గుంటూరులో 8 కోట్లు, కృష్ణా జిల్లాలో 8 కోట్లు, నెల్లూరు జిల్లాలో 4.5 కోట్ల రూపాయలతో సుమారుగా 130 కోట్ల రూపాయలు నికరంగా, 200 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Kalki 2898 AD 7 days Andhra Nizam Area Collections In Telugu States

ఇక ఏడో రోజు నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 3.5 కోట్లు, సీడెడ్‌లో 60 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో 64 లక్షల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 34 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 28 లక్షలు, గుంటూరులో 25 లక్షలు, కృష్ణా జిల్లాలో 33 లక్షలు, నెల్లూరులో 16.5 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 6 కోట్లు నికరంగా, 9 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

గత ఏడు రోజుల్లో కల్కి సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టమే కాకుండా కొన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. గత 7 రోజుల్లో నైజాంలో 67 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలివారంలో 137 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు సాధించింది.

Kalki 2898 AD 7 days Andhra Nizam Area Collections In Telugu States

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ హవా ఎదురు లేకుండా కొనసాగుతున్నది. ఈ సినిమా ప్రస్తుతం సలార్ రికార్డులను తిరగరాసింది. ఇప్పటి వరకు బాహుబలి1 రికార్డును కూడా బ్రేక్ చేసింది. ప్రభాస్ తన సినిమాల కలెక్షన్ రికార్డులు తానే బ్రేక్ చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

ఇక కల్కి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇ్పటి వరకు ఈ సినిమా 137 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా 31 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X