Kalki 2898 AD Advance Booking ఓవర్సీస్‌లో కల్కి సంచలనం.. రిలీజ్‌కు ముందే యూఎస్, యూకేలో రికార్డులు
రెబల్ స్టార్ ప్రభాస్, దీపిక పదుకోన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ లాంటి స్టార్ యాక్టర్లు నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. మహనటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మించారు. ఇండియన్ సినిమా రంగంలోనే కనీవినీ ఎరుగని రీతిలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌తో రూపొందిన ఈ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా విడుదలకు ముందే విదేశీ గడ్డ మీద చరిత్ర తీరగ రాస్తున్నది. ఈ సినిమా సంచలనల వివరాల్లోకి వెళితే..
కల్కి సినిమాను ఇండియన్ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు రూపొందిన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచే విధంగా ఈ మూవీని 600 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా క్రేజ్‌కు తగినట్టుగానే భారీగా బిజినెస్ జరిగింది. ఇక విడుదలకు ప్రపంచవ్యాప్తంగా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ఇటీవల విడుదలైన రిలీజ్ ట్రైలర్ అభిమానులకు కిక్కించేలా ఉండటం మరింత క్రేజీగా మారింది. ఈ ట్రైలర్ అంచనాలు పెంచడంతో ఈ మూవీకి బజ్ భారీగా క్రియేట్ అయింది. దాంతో అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకొన్నది. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా సంచలనాలను నమోదు చేస్తున్నది.
భారతీయ సినిమాలకు ఇటీవల కాలంలో విదేశాల్లో భారీ ఆదరణ దక్కుతున్నది. కల్కి సినిమాకు యూకేలో కూడా మంచి బజ్ ఏర్పడింది. దాంతో ప్రేక్షకుల డిమాండ్‌కు తగినట్టుగానే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం రికార్డు స్థాయి స్క్రీనల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 400 స్క్రీన్లలో యూకేలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.

అమెరికాలో కల్కి సినిమాకు భారీ స్పందన కనిపిస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఓపెన్ అయిన ప్రతీ చోట ముందస్తు బుకింగ్‌లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 1 మిలియన్ డాలర్ మార్క్ మైలు రాయిని దాటేసింది.
ఇక ఓవర్సీస్‌లో కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్ బ్రహ్మండంగా సాగుతున్నది. ఈ చిత్రం ఉత్తర అమెరికా, యూకే, ఇతర దేశాల్లో కలిపి భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. ఇప్పటికే ఈ సినిమా 3.2 మిలియన్ డాలర్లను కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











