కల్కి జోరుకు జైలర్, లియో లైఫ్‌టైమ్ కలెక్షన్లు బ్రేక్.. ప్రభాస్ దెబ్బకు రజనీ, విజయ్ రికార్డులు ఫట్!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడీ మూవీకి ఎదురే లేకుండా దూసుకెళ్తుంది. ఈ సినిమా ప్రభాస్ స్టామినాకు అద్దం పడుతున్నది. చాలా సినిమాలు హాలీడేస్‌ను, పండగలను టార్గెట్ చేసుకొని రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈ సినిమాకు అలాంటి స్ట్రాటేజీ లేకుండా రిలీజై వర్కింగ్ డే రోజున కూడా సంచలన రీతిలో వసూళ్లు రాబడుతున్నది. అయితే 7వ రోజు ఈ సినిమా ఇండియన్ సూపర్ స్టార్స్ సినిమాల కలెక్షను బీట్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
కల్కి చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తున్నది. సాధారణంగా వర్కింగ్ డేస్‌లో వసూళ్లు పడిపోతాయి. కానీ ఈ సినిమా విషయంలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. నాలుగో రోజున ఈ సినిమా 300 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది.

అయితే ఈ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్ సినిమాల కలెక్షన్లను తిరగరాసింది. ఈ ఇద్దరు హీరోల సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను కేవలం 4 రోజుల్లోనే అధిగమించడం ఓ రికార్డుగా చెప్పకోవచ్చు. అలాగే బాహుబలి 1 మూవీ కలెక్షన్లను కూడా బ్రేక్ చేసింది. ఈ సినిమా ఇండియన్ స్టార్ హీరోల కలెక్షన్లను అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక కల్కి చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన 8వ చిత్రంగా నిలిచింది. జైలర్ కలెక్ట్ చేసిన లైఫ్ టైమ్ వసూళ్లు 345 కోట్ల షేర్, లియో 342 కోట్ల రూపాయల కలెక్షన్లను అధిగమించడం విశేషంగా మారింది. ఇక ప్రభాస్ తాన నటించిన సలార్ 407 కోట్ల రూపాయల నికర కలెక్షన్లను క్రాస్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇండియన్ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో బాహుబలి2, RRR, జవాన్, యానిమల్, పఠాన్, గదర్ 2 కలెక్షన్లను ఈ సినిమా టార్గెట్ పెట్టుకొన్నది. పై చిత్రాల్లో ఏ సినిమా రికార్డులను ఎప్పుడు బ్రేక్ చేస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా, ఇండియాలో అన్ని భాషల నికర వసూళ్లు 389 కోట్ల రూపాయలు. 7 రోజుల్లో ఈ సినిమా 680 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా సాధించింది. త్వరలోనే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











