Kalki 2898 AD Collections: RRR, బాహుబలి 2 రికార్డులు బ్రేక్.. కల్కికి తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ రిలీజ్‌కు ముందే రికార్డులను కొల్లగొడుతున్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఊహించని విధంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు భారీగా ఊహకు అందని విధంగా కలెక్షన్లు రిజిస్టర్ అవుతాయని అంచనా వేస్తున్నారు. నైజాంలో మాత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
నైజాం ప్రాంతంలో ప్రభాస్ కలెక్షన్లు సాధించడంలో కింగ్ అని తన సినిమాలు ఇప్పటికే నిరూపించాయి. ఆయన సినిమా హిట్ టాక్ ఫ్లాప్ టాక్‌కు సంబంధం లేకుండా బాక్సాఫీస్ బ్రేక్ చేస్తాయని చాలా సినిమాలు కలెక్షన్లు చూస్తే అర్ధం అవుతుంది. దాంతో నైజాం రెబల్ స్టార్ అడ్డా అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటాయి.

గతంలో ప్రభాస్ నటించిన సినిమాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. బాహుబలి 1 సినిమా తొలి రోజు నైజాంలో 6.32 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక బాహుబలి 2 విసయానికి వస్తే.. 8.9 కోట్లు, సాహో 9.41 కోట్లు, రాధేశ్యామ్ 10.8 కోట్లు, ఆదిపురుష్ 13.68 కోట్లు, సలార్ సినిమా 22.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. రికార్డు స్థాయిలో ప్రీ బిజినెస్ జరిగింది. ఈ సినిమా తొలి రోజు 35 కోట్ల రూపాయలు నైజాంలో వసూలు చేస్తుందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా RRR, బాహుబలి రికార్డులు బ్రేక్ అయ్యాయి.

ఇక వరల్డ్ వైడ్ ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ స్థాయిలో నమోదు అయ్యాయి. కేవలం 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వచ్చాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ 3 స్థానాల్లో ఒకటిగా నిలిచే స్థాయిలో ఉంది.


Click it and Unblock the Notifications











