Kalki All Time Record: ఆ దేశంలో కల్కి ఆల్ టైమ్ రికార్డ్.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తున్నది. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఉత్తర అమెరికా బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్, దిశాపటానీ నటించిన ఈ చిత్రం గత 4 రోజుల్లో కల్కి కెనడా, అమెరికాలో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హలీవుడ్ టెక్నాలజీ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా కల్కి సినిమాను అత్యుత్తమ సాంకేతికతతో రూపొందించడంతో బడ్జెట్ బారీగా అయింది. ఈ సినిమాను 600 కోట్ల రూపాయలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా నార్త్ అమెరికా హక్కులను సుమారుగా 50 కోట్లకు అమ్మినట్టు సమాచారం.

ఉత్తర అమెరికాలో కల్కి సినిమా రిలీజ్‌కు ముందే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ప్రీమియర్లు స్టార్ట్ కావడానికి ముందే ఈ చిత్రం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక తొలి రోజు 5 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే రాబట్టింది. ఆ తర్వాత కూడా రోజు రోజుకు కలెక్షన్లు పెంచుకొంటూ వెళ్లింది.
ఇక నార్త్ అమెరికాలో నాలుగో రోజు బుకింగ్ ముగిసే సమయానికి కల్కి చిత్రం అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం 11 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 90 కోట్లకుపైగా కలెక్షన్లను యూఎస్ బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఈ చిత్రం 5వ రోజు ముగిసే సమయానికి 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక నార్త్ అమెరికాలో భాగమైన కెనడాలో కల్కి చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నది. ఈ చిత్రం ఆ దేశంలో ఏ తెలుగు సినిమా సాధించని విధంగా ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేసిందని ట్రేడ్ వర్గాలు, నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా తొలివారంలో అరుదైన మైలురాయిని అధిగమించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











