ధేశమంతా కల్కికి రికార్డు కలెక్షన్లు.. కానీ అక్కడే దారుణంగా.. ఆ రాష్ట్రంలో కుట్ర జరిగిందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీతో కలెక్షన్ల ఊచకోత కోస్తున్నాడు. రోజుకో కొత్త రికార్డును బ్రేక్ చేస్తూ దూసుకెళ్తున్న కల్కి మూవీకి ఒక్క భాషలో మాత్రం చుక్కెదురైంది. ఏకంగా ఆ భాషలో కలెక్షన్స్ లక్షల్లోకి పడిపోవడం రెబల్స్ ను షాక్ కు గురి చేస్తోంది. అయితే దీనంతటికీ కారణం ఓ కన్నడ నిర్మాణ సంస్థ అంటూ ఫైర్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి ఆ నిర్మాణ సంస్థ కల్కి కలెక్షన్లు తగ్గడానికి ఏ విధంగా కారణమైంది ? ఇంతకీ ఏ భాషలో కల్కి కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ'తో హీరో ప్రభాస్ తో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. నిజానికి ఈ ఏడాది ఏ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరలేదు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' దూకుడు చూస్తుంటే మరికొన్ని గంటల్లోనే ఆ రికార్డుకు కల్కి తన పేరు మీద రాసుకోవడం ఖాయం అన్పిస్తోంది. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఐదు రోజుల్లో రూ.625 కోట్లు రాబట్టింది.

ఈరోజు (మంగళవారం, జూలై 2) ఆరవ రోజు కాగా, కలెక్షన్స్ కౌంట్ మొదలైంది. సమాచారం ప్రకారం 'కల్కి 2898 ఏడీ' 6వ రోజున రూ.27.85 కోట్లు రాబట్టింది. తెలుగు భాషలో 11.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. తమిళం, మలయాళం నుండి 1.2 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్ 14 కోట్ల రూపాయలు. కన్నడ వెర్షన్ నుంచి కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. మొత్తంగా కలుపుకుని రూ.27.85 కోట్లు.
అయితే ఆశ్చర్యంగా కల్కి కలెక్షన్స్ కన్నడలో ఇంతగా ఎందుకు డ్రాప్ అయ్యాయి? అనే చర్చ మొదలైంది ఇప్పుడు. కన్నడ వెర్షన్ అంత తక్కువ వసూళ్లు రాబట్టడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. కర్నాటకలో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను పొందిన కెవిఎన్ ప్రొడక్షనే కల్కి కలెక్షన్లు తగ్గడానికి కారణం. కన్నడలో చాలా తక్కువ షోలు వేశారు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవ పెడుతున్నారు.

అంతేకాకుండా కన్నడ వెర్షన్ కోసం 3D ఆప్షన్ లేదు. దీంతో కన్నడ వెర్షన్ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.371 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల లెక్కల ప్రకారం చూస్తే.. ఈ సినిమా వసూళ్లు 650 కోట్లు దాటాయి. దీంతో కల్కి టీమ్‌లో ఫుల్ ఖుషీగా ఉంది. ఈ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన మొట్ట మొదటి చిత్రంగా కల్కి చరిత్రను రాయబోతోంది.
మరి కొన్ని వారాలు ఈ జోష్ ఎలాంటి అడ్డంకి లేకుండా ఇలాగే సాగితే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి పక్కా 1000 కోట్ల మూవీ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. కాగా కల్కి చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో అశ్వినీదత్ నిర్మించారు. సినిమా రిలీజైన 5 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ కావడం విశేషం.


Click it and Unblock the Notifications











