1000 కోట్లు దాటేసిన కల్కి 2898 AD.. అమితాబ్ సంచలన ట్వీట్‌తో ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ!

ప్రపంచ సినీ చరిత్రలో కల్కి 2898 AD మూవీ అరుదైన మైలురాయిని దాటింది. జూన్ 27వ తేదీన రిలీజైన ఈ చిత్రం ప్రతీచోట కలెక్షన్లు కుంభవృష్టిని కురిపించింది. దాంతో ఈ సినిమా 16 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను అధిగమించింది. అయితే ఈ సినిమా అరుదైన వసూళ్ల ఘనతను సాధించడంతో రెబల్ స్టార్ అభిమానులు పండగ చేసుకొంటున్నారు. ఆ సెలబ్రేషన్‌లో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా భాగమయ్యారు. ఫ్యాన్స్ ట్వీట్లను రీట్వీట్ చేస్తూ అధికారికంగా 1000 కోట్ల కలెక్షన్ల ధృవీకరించారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఓవర్సీస్‌లో కల్కి చిత్రం అరుదైన ఘట్టాన్ని చేరుకొన్నది. ఈ సినిమా కేవలం నార్త్ అమెరికాలోనే 17 మిలియన్ డాలర్ల వసూళ్లను దాటిందంటూ యూఎస్ డిస్టిబ్యూటర్ ప్రత్యాంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది. ప్రభాస్ సత్తా మరోసారి రుజువైంది. 17 మిలియన్ డాలర్లు మైలురాయిని దాటి పరుగులు పెడుతున్నది అని ట్వీట్ చేస్తే.. అమితాబ్ వాహ్ వాహ్ వాహ్ అంటూ కామెంట్ చేశాడు.

Kalki 2898 AD crossed 1000 Crores Collections Amitabh Bachchan confirms officially

కల్కి మూడో వారంలో కూడా కలెక్షన్ల వసూళ్లను రాబడుతున్నది. బాలీవుడ్‌లో కొత్తగా రిలీజైన మూవీస్‌ను కూడా ఈ సినిమా పక్కన పెట్టేసింది. భారీగా వసూళ్లను సాధిస్తున్నదని బాలీవుడ్‌కు చెందిన క్రిటిక్ ట్వీట్ చేస్తే.. అదంతా నాగ్ అశ్విన్ ప్రతిభ. అద్బుతమైన ఆయన పనీతీరుకు ఈ సినిమా నిదర్శనం అని ఆయన అమితాబ్ అన్నారు.

కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలను వసూలు చేసింది అంటూ ట్వీట్ చేస్తే.. ఉఫ్ ఇదో అద్బుతం అంటూ కామెంట్ చేశాడు. అశ్వత్తామ పాత్రలో అద్బుతంగా నటించిన ఆయన ఈ సినిమా విజయాన్ని భారీగా సెలబ్రేట్ చేసుకొంటున్నారు. తన ట్వీట్లతో ఈ సినిమాను మరింత వైబ్రెంట్‌గా మార్చారు.

Kalki 2898 AD crossed 1000 Crores Collections Amitabh Bachchan confirms officially

కల్కి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో అద్బుతమైన రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సినిమా యానిమల్ (815 కోట్లు), జవాన్ (948 కోట్లు), కేజీఎఫ్2 (975), RRR (1007 కోట్ల) షేర్ కలెక్షన్లను అధిగమించింది. 16వ రోజున ఈ సినిమా 1027 కోట్లు మేర వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక కల్కి ముందు ఉన్న బాహుబలి 1330 కోట్ల షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ రికార్డును సినిమా అధిగమిస్తుందా? లేదా అనే ఆసక్తికరంగా మారింది.

అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రెండుసార్లు 1000 కోట్ల క్లబ్‌లో చేరిన హీరోల్లో ప్రభాస్ ఒకరిగా నిలిచారు. దాంతో ఆయనను బాక్సాఫీస్ కింగ్ అంటూ అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇండియన్ సినిమా కలెక్షన్లకు కేరాఫ్ అడ్రస్ అంటూ అభినందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X