Kalki 2898 AD India Collections ఇండియాలో షాకింగ్‌గా కల్కి కలెక్షన్లు.. ప్రభాస్ బాక్సాఫీస్ సంచలనం
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసిన కల్కి 2898 ఏడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు రెడీ అవుతున్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్, దిశా పటానీ నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటిట్ టాక్ రావడంతో ఊహించని విధంగా కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. తొలి రోజు ఇండియా వైడ్‌గా కలెక్ట్ చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కేరళలో కలెక్షన్లు
కల్కి మలయాళం భాషలో ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక తొలి రోజు కోసం అడ్వాన్స్ బుకింగ్ అనూహ్యంగా నమోదైంది. దాంతో తొలి రోజు కేరళలో సుమారుగా 2.5 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు నమోదు అయ్యాయి.

కన్నడ బాక్సాఫీస్ వద్ద
ఇక కన్నడ విషయానికి వస్తే.. పబ్లిక్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ కూడా ఊహించని విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 28 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ మూవీ ఫస్ట్ డే సుమారుగా 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
తమిళ భాషలో వసూళ్లు
ఇక తమిళ భాషలో కల్కి రిలీజ్ విషయానికి వస్తే.. ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 16 కోట్ల రూపాయల మేర జరిగింది. సుమారుగా 17 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించిన ఈ చిత్రం తొలి రోజు భారీగా వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తమిళ భాషలో ఈ చిత్రం 4 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
ఉత్తర భారత్‌లో
ఇక హిందీ భాషలో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా బిజినెస్ దాదాపు 85 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్‌కు ధర పలికింది. అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు కావడంతో ఈ సినిమాకు సుమారుగా 25 కోట్ల రూపాయల నికర కలెక్షన్లు నమోదు అయ్యాయి.

నైజాం, ఆంధ్రాలో కలెక్షన్లు
ఇక తెలుగు రాష్ట్రాల బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీకి రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది. థియేట్రికల్ రైట్స్ దాదాపు 180 కోట్ల రూపాయల మేర ధర పలికింది. అయితే 182 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలు పెట్టిన ఈ చిత్రం తొలి రోజు 65 కోట్ల రూపాయల నికర కలెక్షన్లను రాబట్టింది.
ఇండియా వైడ్ 100 కోట్లు
ఇక ఇండియా వైడ్ కల్కి 2898 ఏడీ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మలయాళంలో 2.5 కోట్లు, తమిళంలో 5 కోట్లు, హిందీలో 25 కోట్లు, కన్నడలో 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 100 కోట్ల నికర వసూళ్లను కేవలం భారత్‌లోనే సాధించింది.


Click it and Unblock the Notifications











