Kalki 10 Days Collections: 900 కోట్లకు చేరువలో కల్కి..10వ రోజు ప్రభాస్ ఎన్ని కోట్లు కుమ్మేశాడంటే?
ఇండియన్ ఎపిక్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా సంచలన రేపుతున్నది. మహాభారతం బ్యాక్ డ్రాప్‌తో ఫ్యూచర్ జనరేషన్ కథాంశాన్ని ముడిపెట్టి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా గత 10 రోజులుగా సంచలనాలను రేపుతున్నది. ఈ సినిమా గత ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కల్కి సినిమా తొలివారం అంటే 8 రోజుల్లో 415 రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా 9వ రోజు 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలోనే అన్ని భాషల్లో కలిపి 432 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంతేకాకుండా విడుదలైన ప్రతీచోట బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది.

ఇక 10వ రోజు ఈ సినిమా రిలీజైన రెండో శనివారం తర్వాత భారీగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తెలుగులో 11 కోట్లు, తమిళంలో 3 కోట్లు, హిందీలో 19 కోట్ల రూపాయలు, కన్నడలో 4 కోట్లు, మలయాళంలో 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా 10వ రోజు 39 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కల్కి చిత్రం తన కలెక్షన్ల ప్రవాహాన్ని ఘనంగా సాగిస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 15 మిలియన్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా మరో 10 మిలియన్ డాలర్లతో దూసుకుపోతున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 25 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
గత 9 రోజుల్లో కల్కి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి ఈ మూవీ 460 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో 200 కోట్ల రూపాయల కలెక్షన్లకు చేరువైంది. తెలుగులో 223 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 200 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 9 రోజుల్లో 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక 10 రోజుల తర్వాత కల్కి సినిమా ఇండియాలో 45 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొన్నారు. దాంతో ఈ సినిమా 10 రోజుల్లో 855 కోట్లు వసూలు చేస్తుంది. ఇక ఆదివారం ఈ సినిమా 900 కోట్ల రూపాయల మార్క్‌ను దాటే అవకాశం పుష్కలంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











