Kalki 12 Days Collections: కల్కి నాన్ బాహుబలి రికార్డ్.. చరిత్ర తిరగరాస్తున్న ప్రభాస్.. 12వ రోజు ఎంతంటే
వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా కల్కి 2898 ఏడీ. ఈ సినిమాను సీ అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్నదత్ నిర్మించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ఈ సినిమా 12వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..
ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక నటించిన కల్కి చిత్రం సుమారుగా 620 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 372 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ రిపోర్ట్. అయితే ఈ సినిమా సుమారుగా 375 షేర్‌తో బ్రేక్ ఈవెన్ సాధించాల్సిన పరిస్థితిలో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.

కల్కి 2898 ఏడీ చిత్రం గత 11 రోజుల్లో ఇండియాలో భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో 250 కోట్లు, కర్ణాటకలో 57 కోట్లు, తమిళనాడులో 38 కోట్లు, కేరళలో 24 కోట్లు, హిందీలో 250 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 607 కోట్లు రూపాయలు వసూలు చేసింది.
కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా 900 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధిస్తుంది. రెండోవారం ముగిసే సమయానికి 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే ఛాన్స్ పక్కాగా కనిపిస్తున్నది. ఈ సినిమా చాలా చోట్ల బాహుబలి 2 సినిమా రికార్డులకు చేరువగా రాగా.. మరికొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేస్తున్నది.

ఇక 12వ రోజు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కల్కి తన బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించింది. తెలుగులో 8.5 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. ఇతర భాషల్లో కలిపి ఈ సినిమా 13 కోట్ల వరకు వసూలు చేస్తుంది. హిందీలో 7 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది. దాంతో ఇండియాలో 12వ రోజు 20 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక 12 రోజుల తర్వాత కల్కి 2898 ఏడీ సినిమా ఓవరాల్ కలెక్షన్లు విషయానికి వస్తే.. ఈ చిత్రం 925 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని వెల్లడించారు. ఇక ఈ సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటికే 110 శాతం రికవరీ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా లాంగ్ రన్ కొనసాగే ఉంది కాబట్టి.. ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో వేచి చూడాల్సిందే అనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











