Kalki 13 Days Collections: ఆగని కల్కి కలెక్షన్ల ఊచకోత.. ప్రభాస్ దెబ్బకు యానిమల్, RRR రికార్డు బ్రేక్
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రం రెండో వారంలో కూడా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోటు ఊహించని కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తున్నది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో ఈ మూవీ చేరింది. సీ అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా 13వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
జూన్ 27వ తేదీన రిలీజైన కల్కి చిత్రం ఓవర్సీస్, హిందీ, నైజాం ప్రాంతాల్లో భారీగా కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ టాప్ 10 క్లబ్‌లో చేరింది. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. త్వరలోనే ఈ చిత్రం 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది.

ఇక 13వ రోజున అంటే రెండో మంగళవారం రోజున భారీగానే కలెక్షన్లు నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో ఈ సినిమా ముఖ్యంగా నార్త్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లకుపైగా వసూళ్లు, తమిళంలో 1 కోటి రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, మలయాళంలో 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 13వ రోజున 10.50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొన్నారు.
ఇండియాలో కల్కి కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగులో 263 కోట్ల రూపాయల గ్రాస్, తమిళంలో 31 కోట్ల గ్రాస్, కర్నాటకలో 58 కోట్లు, తమిళనాడులో 39 కోట్లు, కేరళలో 24.5 కోట్లు, హిందీలో 260 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 645 కోట్లు రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.
ఇక కల్కి చిత్రం 11వ రోజు వరకు 900 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. 12వ రోజున ఈ సినిమా 15 కోట్ల రూపాయలు రాబట్టింది. 13వ రోజున ఈ సినిమా 10 నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా 13 రోజుల్లో 925 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో 13వ రోజున సాధించిన కలెక్షన్లను బట్టి చూస్తే యానిమల్, సలార్, RRR రికార్డులను అధిగమించిందని ట్రేడ్ వర్గాలు తెలిపారు.


Click it and Unblock the Notifications











