Kalki 14 Days Collections కల్కి మరో బాక్సాఫీస్ చరిత్ర.. 1000 కోట్లకు మరింత చేరువగా ప్రభాస్ మూవీ!
భారతీయ పురాణాలను, ఫ్యూచర్ జనరేషన్‌ను కనెక్ట్ చేస్తూ రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను రాబడుతున్నది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండు వారాలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ఈ సినిమా 14వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఆంధ్రా, నైజాంలో కలిపి మొత్తంగా 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే తమిళంలో 75 లక్షలు, కన్నడలో 1 కోటి రూపాయలు, మలయాళంలో 50 లక్షల రూపాయలు రాబడుతుంది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ సినిమా హిందీలో ప్రధానంగా నార్త్ ఇండియాలో భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా ఇప్పటికే 225 కోట్ల రూపాయలు వసూలు చేయడం తెలిసిందే. ఇక ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. హిందీలో 14వ రోజున 5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దాంతో ఈ సినిమా గత పద్నాలుగు రోజుల్లో ఇండియాలో వసూళ్లు ఇలా ఉన్నాయి. తెలుగులో ఈ సినిమా 252 కోట్ల రూపాయలు, తమిళంలో 40 కోట్ల రూపాయాలు, కన్నడలో 60 కోట్ల రూపాయలు, మలయాళంలో 25 కోట్ల రూపాయలు, హిందీలో 262 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 630 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.
ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలోనే ఈ సినిమా 17 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 141 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఇతర దేశాల్లో ఈ సినిమా 14 మిలియన్ డాలర్లు అంటే.116 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఓవర్సీస్‌లో కూడా 260 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక కల్కి చిత్రం 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 900 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. 12వ రోజు ఈ చిత్రం 15 కోట్ల గ్రాస్, 13వ రోజు 12 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇక 14వ రోజు ఈ సినిమా ఇండియాలో 7 కోట్ల రూపాయాలు గ్రాస్, అలాగే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 937 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన 4వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











