Kalki 15 Days Collections: 1000 కోట్ల టార్గెట్‌పై భారీ దెబ్బ.. ప్రభాస్ రికార్డును అడ్డుకొన్నదేంటో తెలుసా?

కల్కి 2898 AD చిత్రం కలెక్షన్ల ఊపు తగ్గినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. 380 కోట్ల రూపాయల షేర్ బాక్సాఫీస్ టార్గెట్‌తో ఈ సినిమా జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా అందరూ ఊహించిన దానికన్నా.. అతి త్వరగా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీగా లాభాలను సొంతం చేసుకొంటున్నది. ఇక ఈ సినిమా 15వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ నటించిన ఎపిక్ థ్రిల్లర్ కల్కి మూవీ 14వ రోజున కూడా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ మూవీ తెలుగులో 1.8 కోట్ల రూపాయలు, తమిళంలో 75 లక్షల రూపాయలు, హిందీలో 4.6 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, మలయాళంలో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 8.6 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.

Kalki 2898 AD Day 15 Box Office Collections

దాంతో కల్కి సినిమా ఇండియాలో భారీగా వసూళ్లను రాబట్టింది. తెలుగులో 253 కోట్ల రూపాయలు, అలాగే తమిళంలో 32 కోట్ల రూపాయలు, హిందీలో 229 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 60 కోట్ల రూపాయలు, మలయాళంలో 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 640 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

కల్కి మూవీ రెండోవారం ముగింపు రోజున అంటే 15వ రోజున 7 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది. తెలుగులో 1.65 కోట్లు, తమిళనాడులో 60 లక్షల రూపాయలు, హిందీలో 4 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 80 లక్షల రూపాయలు, మలయాళంలో 35 లక్షల రూపాయలు వసూలుచేసింది.

ఇక తొలివారం ఇండియాలో 415 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ మూవీ.. రెండోవారం ముగిసే రోజున 190 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 6 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా సరికొత్త రికార్డులను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసే అవకాశం లభించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే.. ఈ మూవీ నార్త్ అమెరికాలో 17 మిలియన్ డాలర్లు రాబట్టింది. మిగితా దేశాల్లో 13 మిలియన్ డాలర్లు సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో కేవలం 11 రోజుల్లోనే 900 కోట్ల రూపాయలు రాబట్టింది. ఆ తర్వాత 15వ రోజు నాటికి ఈ సినిమా 47 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 950 కోట్లకు చేరువైంది. అయితే ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లలో చేరాల్సింది. కానీ ఉత్తర భారత దేశంలో వరదలు, తుఫాన్ కారణంగా ఈ మైలురాయిని దాటడంలో ఆలస్యమైందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X