Kalki 16 Days Collections: కల్కి కలెక్షన్లపై ఆ రెండు సినిమాల దెబ్బ.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కల్కి 2898 ఏడీ చిత్రం గత రెండు వారాల్లో భారీ వసూళ్లు సాధించింది. ఇక మూడో వారంలోకి ప్రవేశించిన ప్రభాస్ చిత్రం తొలిసారి భారీగా కలెక్షన్లు పడిపోయాయి. అయితే అందుకు కారణం తెలుగు, హిందీలో స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ కావడంతో కలెక్షన్లు తగ్గినప్పటికీ.. నిలకడగా వసూళ్లు రాబట్టడం విశేషంగానే చెప్పుకోవాలి. ఇక నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సినిమా 16వ రోజు ఎలాంటి వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..
కల్కి 2898 ఏడీ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా మూడో వారంలోకి అడుగుపెట్టింది. అయితే 3వ వారంలో ఈ సినిమాకు గట్టిపోటీ ఎదురైందనే చెప్పాలి. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన సర్ఫీరా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమా రిలీజ్ అయ్యాయి. దాంతో ఈ సినిమా కలెక్షన్లపై భారీగానే ప్రభావం పడిందనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక కల్కి సినిమా 16వ రోజు విషయానికి వస్తే.. ఈ చిత్రం తెలుగులో 1.5 కోట్ల రూపాయలు, తమిళంలో 50 లక్షలు, హిందీతలో 3.25 కోట్ల రూపాయలు, కన్నడలో 60 లక్షలు, మలయాళంలో 40 లక్షల రూపాయలు వసూలు చ ేసింది. దాంతో మొత్తంగా ఇండియాలో 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
దాంతో ఈ సినిమా ఇండియాలో కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తెలుగులో 254.5 కోట్ల రూపాయలు, అలాగే తమిళంలో 32.5 కోట్ల రూపాయలు, హిందీలో 232.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 60.5 కోట్ల రూపాయలు, మలయాళంలో 25.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 646.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. గత 15 రోజుల్లో 950 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. 16వ రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేశారు. దాంతో ఈ సినిమా 955 కోట్ల రూపాయలు గ్రాస్ రూపంలో నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











