Kalki 17 days Collections: 1000 కోట్ల తర్వాత ఆగని కల్కి దూకుడు.. షారుక్, సల్మాన్ లైఫ్ టైమ్ రికార్డులు బ్రేక్
వరల్డ్ వైడ్‌గా రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్న కల్కి సినిమా మూడో వారంలో కూడా దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ సినిమా 16 రోజుల్లోనే పలు బాలీవుడ్ హీరోల లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించడం సంచలనంగా మారింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం 17వ రోజున కూడా భారీ కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అమితాబ్, కమల్, దీపిక, దిశా పటానీ తదితరులు నటించిన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ నటించిన కల్కి చిత్రం తొలివారంలో 417 కోట్లు వసూలు చేసింది. తెలుగులో 212 కోట్లు, తమిళంలో 23 కోట్లు, హిందీలో 162 కోట్లు, కన్నడలో 30 కోట్లు, మలయాళంలో 14 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండోవారంలో 129 కోట్లు వసూలు చేసింది. తెలుగలో 41 కోట్లు, తమిళంలో 9 కోట్లు, హిందీలో 70 కోట్లు, కన్నడలో 20 కోట్లు, మలయాళంలో 5.8 కోట్లు రాబట్టింది.

కల్కి 17వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. హిందీలో 8 కోట్ల రూపాయలు, తెలుగులో 5 కోట్ల రూపాయలు, తమిళంలో 40 లక్షలు, కర్ణాటకలో 1 లక్షలు, మలయాళంలో 80 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 17 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియాలో 564 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లయింది.
ఇక ఉత్తర అమెరికాలో ఇంకా మూడో వారంలో కూడా భారీగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా కొత్తగా రిలీజైన సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే 17 మిలియన్ల డాలర్లు వసూలు చేసిన ఈ మూవీ మరో 500K రాబట్టింది. దాంతో ఈ మూవీ అమెరికాలో 18 మిలియన్ డాలర్లకు చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 28 నుంచి 30 మిలియన్ల డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

16 రోజుల్లో 1000 కోట్ల రూపాయలు రాబట్టిన కల్కి.. 17వ రోజున ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను భారీగా పెంచుకొన్నది. గత 17 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 266 కోట్లు, హిందీలో 245 కోట్ల రూపాయలు, ఇండియాలో ఇతర భాషల్లో మరో 250 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 233 కోట్లు వసూలు చేసింది.
దాంతో ఈ సినిమా తాజాగా షారుక్ ఖాన్ పఠాన్ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్లు 1050 రికార్డును తిరగరాసింది. సల్మాన్ ఖాన్ భజరంగీ భైజాన్, ఇతర బాలీవుడ్ చిత్రాల జీవితకాలపు కలెక్షన్లు అధిగమిస్తూ దూసుకుపోతున్నది. తాజాగా బాలీవుడ్, తమిళంలో రిలీజైన సర్ఫీరా, ఇండియన్ 2 సినిమాలు ఫ్లాప్ కావడంతో మరోసారి కల్కి కలెక్షన్లు ఊపందుకొన్నాయి.


Click it and Unblock the Notifications











