Kalki 18 days Collections: ఆగని ప్రభాస్, కల్కి వసూళ్ల ఊచకోత.. షారుక్ పఠాన్ లైఫ్‌టైమ్ రికార్డు బ్రేక్!

కల్కి 2898 AD మూడో వారంలో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రాబడుతున్నది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం కేవలం 16 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. అయినా ఈ సినిమా వసూళ్ల జోరును కొనసాగిస్తూనే ఉంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను సీ అశ్వినీదత్, ప్రియాంక, స్వప్న దత్ నిర్మించారు. ఈ సినిమా 18వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఇండియాలో కల్కి మూవీ రికార్డులను తిరగరాస్తున్నది. ఈ సినిమా తొలివారం 415 కోట్లు రాబడితే.. రెండో వారం 129 కోట్లు వివిధ భాషల్లో వసూలు చేసింది. దాంతో రెండువారాల్లోనే ఈ సినిమా ఇండియాలో 545 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

Kalki 2898 AD Day 18 Box Office Collections

ఇక 18వ రోజు కల్కి వసూళ్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగులో 5.5 కోట్లు, హిందీలో 10 కోట్ల రూపాయలు, కన్నడలో 1 కోటి రూపాయలు, తమిళంలో 50 లక్షలు, మలయాళంలో 75 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 17.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 580 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక 18వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా 18 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. నార్త్ అమెరికా, ఓవర్సీస్‌లో కలుపుకొని ఈ సినిమా 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిచాయి. దాంతో ఈ సినిమా 1052 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

కల్కి సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 16 రోజుల్లో ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 17వ రోజు 27 కోట్ల రూపాయలు, 18వ రోజు 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 1050 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా త్వరలోనే 1100 కోట్ల మైలురాయిని దాటే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉండగా, కల్కి చిత్రం జైలర్, గదర్ 2, పీకే, సీక్రెట్ సూపర్ స్టార్, యానిమల్, భజ్ రంగీ భైజాన్, పఠాన్ సినిమాల రికార్డులను అధిగమించింది. 1052 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన 6వ చిత్రంగా రికార్డు తిరగరాసింది. ఇక తదుపరి టార్గెట్‌గా జవాన్ 1162 కోట్ల కలెక్షన్లను లక్ష్యంగా చేసుకొన్నది.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X