Kalki 19 days Collections: దారుణంగా పడిపోయిన కల్కి కలెక్షన్లు.. 19వ రోజు ఎన్ని కోట్లంటే?

ప్రభాస్ నటించిన కల్కి చిత్రం గత మూడు వారాలుగా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 16 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ హీరోలు లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమిస్తూ రికార్డుల క్రియేట్ చేస్తున్నది. ఇదిలా ఉండగా 19వ రోజు బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటంటే..

కల్కి చిత్రం 18 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఇప్పటి వరకు నైజాంలో 260 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 64 కోట్ల రూపాయలు, తమిళనాడులో 40 కోట్ల రూపాయలు, కేరళలో 29 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 278 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 240 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Kalki 2898 AD Day 19 Box Office Collection

కల్కి సినిమా 19వ రోజు దాదాపు భారీగానే కలెక్షన్లు క్షీణించాయి. ఈ సినిమా తెలుగులో 1.5 కోట్ల రూపాయలు, తమిళంలో 25 లక్షలు, హిందీలో 2.5 కోట్లు, కర్ణాటకలో 50 లక్షలు, మలయాళంలో 25 లక్షలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో సుమారుగా 5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా 19వ రోజు ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే... ఈ సినిమా ఇండియాలో 4 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్‌గా 6 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో ఈ సినిమా 1060 కోట్ల రూపాయల వసూళ్ల వద్ద నమోదు చేసే అవకాశం ఉంది.

ఇక 16 రోజుల్లో 1000 కోట్ల మైలరాయిని అధిగమించిన ఈ సినిమా.. 17వ రోజు 20 కోట్ల గ్రాస్, 18వ రోజు 25 కోట్ల గ్రాస్, 19వ రోజు 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 1050 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X