Kalki 2898 AD Day 2 Collections తొలి రోజు 191 కోట్లు.. కల్కి 2వ రోజు అదే కుమ్ముడు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే!
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా అందరూ ఊహించినట్టుగానే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ట్రేడ్ వర్గాల అంచనాలకు దాదాపుగా తొలి రోజు వసూళ్ల సునామీని సృష్టించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ సినిమా 2వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఇండియన్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తోపాటు బాలీవుడ్ హీరోయిన్లు దీపిక పదుకోన్, దిశా పటానీ నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమా బిజినెస్‌ను సుమారుగా 385 కోట్ల రూపాయల మేర పూర్తి చేశారు.

కల్కి సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమే కురిపించింది. ఈ సినిమా ఆంధ్రాలో 35 కోట్ల గ్రాస్, నైజాంలో 32 కోట్ల గ్రాస్‌తో మొత్తంగా ఈ మూవీ 67 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 12.25 కోట్ల గ్రాస్, తమిళనాడులో 5 కోట్ల గ్రాస్, కేరళలో 3 కోట్ల గ్రాస్, హిందీలో 24 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఇండియాలో 111 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక ఓవర్సీస్‌లో కల్కి బాక్సాఫీస్‌ను కుమ్మేసిందా? అనే విధంగా కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు కలుపుకొని 5 మిలియన్ల మేర అంటే దాదాపు 40 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో మిగితా దేశాల్లో కలుపుకొని సుమారుగా 80 కోట్ల మేర కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక ఇండియాలో కల్కి సినిమా రెండో రోజు స్ట్రాంగ్‌గా కనిపించింది. తొలి రోజు బాక్సాఫీస్ విధ్వంసం తర్వాత రెండో రోజు కాస్త దూకుడును తగ్గించింది. ఈ సినిమా మార్నింగ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 55 శాతం, ఈవెనింగ్ షోకు 60 శాతం, నైట్ షోకు 55 నుంచి 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో కల్కి రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 65 శాతం, వరంగల్‌లో 60 శాతం, వైజాగ్‌లో 58 శాతం, కరీంనగర్ 55 శాతం, మహబూబ్ నగర్ 83 శాతం, కాకినాడ 55 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది.

ఇక కల్కి 2898 ఏడీ రెండో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 30 నుంచి 35 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఇక హిందీలో 20 కోట్లు కలెక్షన్ల రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్‌గా 85 నుంచి 90 కోట్ల కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 191 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రెండో రోజు 90 కోట్ల మేర రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 280 నుంచి 300 కోట్ల మధ్య కలెక్షన్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే దూకుడు కొనసాగితే.. తొలివారంలో 1000 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











