Kalki day 2 Overseas Collections యూఎస్‌లో కల్కి కలెక్షన్ల ప్రభంజనం.. ఓవర్సీస్‌లో ప్రభాస్ మూవీకి 100 కోట్లు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రభాస్ స్టామినాను మరోసారి రుజువు చేసింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ సినిమా కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. గత రెండు రోజులుగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కల్కి 2898 ఏడీ సినిమాకు భారీ డిమాండ్ ఉండటంతో ఓవర్సీస్‌లో థియేట్రికల్ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ మార్కెట్ హక్కులను 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఉత్తర అమెరికా, ఇతర దేశాల్లో ఈ మూవీని 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక స్క్రీన్లలో రిలీజైన చిత్రంగా నిలిచింది.

ఇక కల్కి సినిమా ప్రీమియర్లకు, తొలి రోజు షోలకు ఉత్తర అమెరికాలో భారీ డిమాండ్ కనిపించింది. దాంతో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. తొలి రోజు ప్రీమియర్లతో కలిపి తొలి రోజు 5.56 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు తెలుగు హీరోలలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ప్రభాస్ మరోసారి తన సత్తాను చాటుకొన్నారు.
ఇక ఉత్తర అమెరికా అంటే.. కెనడా, అమెరికాలో ఈ సినిమా రెండో రోజు కూడా భారీగానే వసూళ్లు నమోదు చేసింది. రెండో రోజు కరెంట్ బుకింగ్ ముగిసే సమయానికి ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ మూవీ నార్త్ అమెరికాలో 7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇంకా ఈ లెక్క పెరిగే అవకాశం ఖూడా ఉంది.

ఇక ఉత్తర అమెరికా మినహాయిస్తే.. ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రం భారీగానే కలెక్షన్లు రాబట్టింది. తొలి రోజు ముగిసే సమయానికి 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా ఈ మూవీ మరో మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి.
దాంతో ఈ సినిమా మొత్తంగా ఓవర్సీస్‌లో తొలి రోజు 7.35 మిలియన్ డాలర్లు, రెండో రోజు కలిపితే మొత్తం 10 మిలియన్ డాలర్లు అంటే.. 80 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలివారాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఓవర్సీస్‌లో 100 Crores కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











