Kalki 20 days Collections: కల్కి ఓ చోట 300 కోట్లు.. మరోచోట 600 కోట్లు.. ప్రభాస్ మూవీ సంచలనం

కల్కి 2898 AD చిత్రం బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్ల జర్నీని కొనసాగిస్తున్నది. ప్రభాస్ కెరీర్‌లోనే రెండో అత్యుత్తమ వసూళ్లను సాధించిన చిత్రంగా ఈ సినిమా ఘనతను సొంతం చేసుకొన్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన ఎపిక్ అండ్ కల్ట్ మూవీ సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. 50 ఏళ్ల చరిత్ర ఉన్న వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ రూపొందించిన ఈ మూవీ ఇండియన్ సినిమాలో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రంగా మారింది. ఈ సినిమా 20 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కల్కి చిత్రం తొలి రోజున రికార్డు కలెక్షన్లతో వసూళ్లను ప్రారంభించింది. తొలివారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారుగా 415 కోట్ల రూపాయలు రాబట్టింది. రెండోవారంలో అదే ఊపును కొనసాగిస్తూ.. 129 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో వారంలో ఇప్పటి వరకు 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 600 కోట్ల రూపాయలు రాబట్టింది.

Kalki 2898 AD Day 20 Box Office Collections Worldwide Prabhas movie first time heavy drop after release

ఇక 20వ రోజు ప్రభాస్ నటించిన మూవీ నిలకడగా వసూళ్లను రాబట్టింది. తాజాగా విడుదలైన సినిమాలు సర్ఫీరా, ఇండియన్ 2 కంటే ఈ సినిమా ఎక్కువగా కలెక్షన్లను నమోదు చేసింది. 20వ రోజున తెలుగులో 1 కోటి, తమిళంలో 25 లక్షలు, హిందీలో 2.5 కోట్లు, కర్ణాటకలో 40 లక్షలు, మలయాళంలో 25 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 4.4 కోట్లు రాబట్టింది.

కల్కి చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో రిలీజైంది. ఇక ఈ సినిమా ఆయా భాషల్లో వసూలు చేసిన వివరాల్లోకి వెళితే.. గత 20 రోజుల్లో తెలుగులో 262 కోట్ల రూపాయల నికర వసూళ్లు, హిందీలో 300 కోట్ల రూపాయలు, కన్నడలో 67 కోట్ల రూపాయలు, తమిళంలో 43 కోట్ల రూపాయలు, మలయాళంలో 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 600 కోట్ల రూపాయలు ఇండియాలోనే రాబట్టింది.

ఇక నార్త్ అమెరికాలో ఈ చిత్రం రికార్డుల పరంపర కొనసాగించింది. ఇండియన్ సినిమా చరిత్రలో పలు హీరోల సినిమాల రికార్డులను తిరగా రాసింది. ఈ చిత్రం 19 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం అమెరికాలోనే 160 కోట్లు వసూలు చేసింది.

Kalki 2898 AD Day 20 Box Office Collections Worldwide Prabhas movie first time heavy drop after release

ఓవర్సీస్‌లో కల్కి సినిమా పలు దేశాల్లో టాప్ కలెక్షన్లను సాధించింది. శ్రీలంక, రష్యా, జర్మనీ లాంటి దేశాలతోపాటు యూకేలో రికార్డు వసూళ్లను రాబట్టింది. బ్రిటన్‌లో 1.5 మిలియన్ పౌండ్లు (16 కోట్లు) సాధించింది. ఇప్పటి వరకు ఈ మార్క్‌ను బాహుబలి 2, లియో సినిమాలు మాత్రమే చేరగలిగాయి.

కల్కి చిత్రం ఓవర్సీస్‌లో సుమారుగా 30 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 256 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియాలో 17 రోజుల్లో 1000 కోట్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటి వరకు 1067 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X