Kalki 21 days Collections: అనూహ్యంగా పెరిగిన కల్కి కలెక్షన్లు..ప్రభాస్ మూవీకి 21వ రోజు ఎన్నికోట్లంటే?

ఇండియన్ సినిమా రంగంలో సంచలన విజయం సాధించిన కల్కి 2898 AD చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల మైలురాయిని దాటేసి.. మరో సరికొత్త చరిత్రను లిఖించేందుకు పరుగులు పెడుతున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ రూపొందించిన ఈ సినిమా 21వ రోజున కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఆ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కల్కి చిత్రం గత 21 రోజుల్లో రికార్డు వసూళ్లను రాబట్టమే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో అత్యుత్తమ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 17 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇటీవల కాలంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అదే జోష్‌ను 21వ రోజున కూడా కనబరిచింది.

Kalki 2898 AD Day 21 Box Office Collection

ఇక 21వ రోజున ఇండియాలో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో 2 కోట్ల రూపాయలు, హిందీలో 3 కోట్ల రూపాయలు, తమిళంలో 50 లక్షలు, కన్నడలో 75 లక్షలు, మలయాళంలో 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 6.5 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఇండియాలో 600 కోట్ల మైలురాయిని చేరుకొన్నది.

ఇక ఓవర్సీస్‌లో కల్కి చిత్రం 18 మిలియన్ల డాలర్ల మైలురాయిని దాటింది. అంటే ఈ సినిమా కెనడా, అమెరికాలో కలిపి 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా స్టడీగా కలెక్షన్లు సాధిస్తున్నది. రానున్న కాలంలో 20 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం మూడోవారంలో మరోసారి అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి ఈ సినిమా సుమారుగా 8 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 1063 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X