Kalki 24 days Collections: ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన కల్కి.. ప్రభాస్ మూవీ మరో సంచలనం
ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే ఇండియన్ సినిమా రంగంలో అనేక రికార్డులను తొక్కేసుకొంటూ విజయ ఢంకా మోగిస్తున్నది. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపిక పదుకోన్, దిశాపటానీ లాంటి అగ్ర నటలు నటించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నీరాజనం పడుతున్నారు. ఈ సినిమా 24 రోజుల కలెక్షన్లు, రికార్డుల గురించిన వివరాల్లోకి వెళితే..
మహేష్ బాబు థియేటర్‌లో
50 ఏళ్లు పూర్తి చేసుకొన్న వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆన్‌లైన్ టికెటింగ్ విధానంలో చరిత్ర సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డుల క్రియేట్ చేసింది. అలాగే మహేష్ బాబు సొంత థియేటర్ ఏఎంబీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సుమారుగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రంగా మరో రికార్డును నెలకొల్పింది.

కల్కి మొదటి వారంలో
కల్కి చిత్రం తొలివారం కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ తెలుుగలో 213 కోట్ల రూపాయలు, తమిళంలో 23 కోట్ల రూపాయలు, హిందీలో 163 కోట్ల రూపాలయు, కన్నడలో 35 కోట్ల రూపాయలు, మలయాళంలో 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 450 కోట్ల రూపాయలు కలెక్షన్లు ఇండియాలో రాబట్టింది.
ప్రభాస్ సినిమా రెండోవారంలో
ప్రభాస్ నటించిన ఈ ఎపిక్ చిత్రం రెండోవారంలో కూడా భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం తెలుగులో 41 కోట్ లరూపాయలు, తమిళంలో 9 కోట్ల రూపాయలు, హిందీలో 70.5 కోట్లు, కన్నడలో 15 కోట్లు, మలయాళంలో 5.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 140 కోట్లు వసూలు చేసింది.

కల్కి 2898 AD మూడో వారంలో
ఇక మూడో వారంలో ఈ సినిమా అదే జోష్‌ను కొనసాగించింది. తెలుగులో 18 కోట్లు, తమిళంలో 2 కోట్లు, హిందీలో 33 కోట్ల రూపాయలు, కన్నడలో 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

నాగ్ అశ్విన్ మూవీ నాలుగోవారంలో
ఇక నాలుగో వారంలో కూడా కల్కి చిత్రం స్టడీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం 23 రోజున 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 24వ రోజున రికార్డు స్థాయిలో 6 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 610 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 250 కోట్ల నికరంగా రాబట్టింది. దాంతో ఈ సినిమా 900 కోట్లు నికరంగా.. 1080 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











