Kalki 25 days Collections: ప్రభాస్ మూవీ 25వ రోజున కూడా కుమ్ముడే కుమ్ముడు.. 1100 కోట్లకు చేరువగా కల్కి!
ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం 4వ వారంలో కూడా భారీ కలెక్షన్లను మాత్రమే కాకుండా రికార్డులను తిరగరాసే వసూళ్లను రాబడుతున్నది. అమితాబ్, కమల్, దీపిక, దిశా పటానీ తదితరులు నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను నమోదు చేస్తున్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం గత 25 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
పురాణాలు, ఫ్యూచర్ జనరేషన్ కథా నేపథ్యంతో తెరకెక్కిన కల్కి చిత్రం 16వ రోజున 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత కూడా ఈ సినిమా స్థిరంగా, నిలకడగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం 17వ రోజున 20 కోట్లు, 18వ రోజున 22 కోట్ల గ్రాస్, 19వ రోజున 6 కోట్లు, 20 రోజున 7 కోట్లు, 21వ రోజున 7 కోట్లు, 22 రోజున 4.5 కోట్లు, 23వ రోజున 3.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 1070 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇండియాలో కల్కి సినిమా తెలుగులో 282 కోట్ల రూపాయలు, హిందీలో 317 కోట్ల రూపాయలు, కన్నడలో 00 కోట్ల రూపాయలు, తమిళంలో 50 కోట్ల రూపాయలు, మలయాళంలో 35 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఇండియాలో ఈ చిత్రం 775 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక 25వ రోజు ఆదివారం నాడు ఈ సినిమా భారీగా కలెక్షన్లను కుమ్మేసింది. ఈ సినిమా మరోసారి వసూళ్ల ధమాకాను క్రియేట్ చేసింది. తెలుగులో 2.5 కోట్ల రూపాయలు, తమిళంలో 50 లక్షలు, హిందీలో 5 కోట్లు, కన్నడంలో 70 లక్షలు, మలయాళంలో 40 లక్షలు రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 9.1 కోట్ల రూపాయలు నమోదు చేసింది.

ఇక ఓవర్సీస్‌లో కల్కి సినిమాకు భారీగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 18.5 మిలియన్ డాలర్లు, అలాగే వరల్డ్ వైడ్‌గా 30 మిలియన్ డాలర్లకుపైగా అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమా 280 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో ఈ చిత్రం చేరింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇండియాలో 775 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 280 కోట్లు రూపాయల వసూళ్లను రాబట్టింది. ధాంతో ఈ సినిమా 1100 కోట్ల రూపాయల మైలురాయికి చేరువ కానున్నది. 500 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











