Kalki 28 days Collections: ఇండియాలో చరిత్ర సృష్టించిన కల్కి.. ప్రభాస్ అరుదైన ఘనత
కల్కి 2898 AD చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్నది. ప్రభాస్ కెరీర్‌లోనే ఈ సినిమా అద్బుతమైన కలెక్షన్లను రాబడుతూ ఇంకా 28 రోజుల తర్వాత కూడా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 28 రోజుల తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘనతలు ఏమిటి? మొత్తం కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
కల్కి చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలివారం 415 కోట్ల రూపాయలు, రెండో వారంలో 129 కోట్ల రూపాయలు, మూడో వారంలో 56 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నాలుగో వారంలో కూడా 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

కల్కి చిత్రం 28వ రోజున కూడా ఇండియాలో నిలకడగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 1.8 కోట్లు నికరంగా.. 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలోనే ఈ సినిమా 635 కోట్ల రూపాయలను నమోదు చేసింది. హిందీలో అత్యధికంగా 1 కోటి రూపాయలు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో 280 కోట్ల రూపాయల గ్రాస్, ఇండియాలో 635 కోట్లు నికరంగా, 790 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. 1070 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం త్వరలోనే 1100 కోట్ల మైలురాయిని దాటుతుందా అనేది వేచి చూడాల్సిందే.

కల్కి చిత్రం తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద బాహుబలి 1810 కోట్ల రూపాయలు, RRR 1236 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డును సెట్ చేశాయి. తాజాగా కల్కి చిత్రం సుమారుగా 1100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో 3వ స్థానంలో నిలిచింది.
ఇక దక్షిణాది సినిమా పరిశ్రమలో కల్కి చిత్రం 4వ స్థానంలో నిలిచింది. బాహుబలి, RRR సినిమాల తర్వాత కేజీఎఫ్ 2 చిత్రం 1.35 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత స్థానంలో కల్కి 2898 ఏడీ సినిమా నిలిచింది. అయితే RRR, KGF2 రికార్డులను ఈ సినిమా అధిగమిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే. అయితే ఈ ఘనతలో ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు ఉండటం అరుదైన ఘనతగా భావించాలి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











