Kalki 2898 AD Day 3 Collections 400 కోట్లకు చేరువగా కల్కి.. ప్రభాస్ కలెక్షన్ల సంచలనం
తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ అశ్వినీదత్ నిర్మించిన కల్కి 2898 ఏడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నది. రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఈ మూవీ 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సినిమా రంగంలో లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో.. స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్, దిశా పటానీ నటించిన ఈ చిత్రాన్ని సుమారుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 380 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ మూవీని సుమారుగా 10000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

సలార్ లాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ నటించిన ఈ మూవీ రిలీజ్ కానుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. ఈ మూవీకి సాధారణ ప్రజలే కాకుండా క్రిటిక్స్ కూడా ప్రశంసలు గుప్పించారు. దాంతో సుడిగాలిలా వసూళ్లు నమోదయ్యాయి.
కల్కి మూవీ తొలి రోజు రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. తెలుగులో 66 కోట్లు, తమిళంలో 4.5 కోట్ల రూపాయలు, హిందీలో 28 కోట్ల రూపాయలు, కన్నడలో 12.5 కోట్లు, కేరళలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 70 కోట్ల రూపాయలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 191.5 కోట్లు వసూలు చేసింది.

ఇక రెండో రోజు విషయానికి వస్తే.. తెలుగులో 26 కోట్ల రూపాయలు, తమిళంలో 4.5 కోట్ల రూపాయలు, కన్నడలో 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో 24 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 60 కోట్ల రూపాయలు నికరంగా నమోదు చేసింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 295 కోట్ల రూపాయలు వసూలు చేసిందని నిర్మాత ప్రకటించారు.
ఇక మూడో రోజు విషయానికి వస్తే.. తెలుగులో సుమారుగా 30 నుంచి 45 కోట్లు, హిందీలో 30 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఇండియాలో సుమారుగా 80 కోట్ల రూపాయలు నికరంగా.. 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా మూడో రోజు 400 కోట్లకు చేరువ కానున్నది.


Click it and Unblock the Notifications











