Kalki Day 3 Overseas Collections: అమెరికాలో ప్రభాస్ సంచలనం..కల్కి దెబ్బకు షారుక్, హృతిక్ రికార్డులు అవుట్

ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా ఓవర్సీస్‌లో రికార్డులు తిరగరాస్తున్నది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నార్త్ అమెరికాలో అగ్ర హీరోల రికార్డులను బ్రేక్ చేస్తున్నది. కమల్ హాసన్, దీపిక పదుకోన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఓవర్సీస్‌లో 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కల్కి 2898 ఏడీ సినిమా కోసం నార్త్ అమెరికాలో పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు భారీగా పోటీ పడ్డాయి. చివరకు ఓవర్సీస్ మార్కెట్ హక్కులను 70 కోట్ల రూపాయల మేర బిజినెస్ క్లోజ్ అయింది. ఉత్తర అమెరికా, ఇతర దేశాల్లో ఈ మూవీని 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం హిట్ టాక్ రావడంతో స్క్రీన్ల సంఖ్యను పెంచుతున్నారు. ప్రభాస్ కెరీర్‌లో అత్యధిక స్క్రీన్లలో రిలీజైన చిత్రంగా నిలిచింది.

Kalki 2898 AD Day 3 North America and Overseas Box Office Collections Prabhas movie crossed 100 crores

ఇక నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికాలో ప్రీమియర్ల ద్వారా 3,904,602 డాలర్లు వసూలు చేసింది. ఇక తొలి రోజు 1,657,063 డాలర్లు రాబట్టింది. దాంతో 55,61,665 డాలర్లు కలెక్షన్లు అంటే భారతీయ కరెన్సీలో 45 కోట్ల రూపాయలను మొదటి రోజే సాధించింది.

ఇక రెండో రోజు కూడా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధించింది. రెండో రోజు 1,727,815 డాలర్లు అంటే.. సుమారుగా 14 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇక మూడో రోజు ఈ చిత్రం కడపటి వార్తలు అందేసరికి $730,185 డాలర్లు వసూలు చేసింది. క్లోజింగ్ సమాయానికి 1 మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

గత మూడు రోజుల్లో కల్కి సినిమా అమెరికాలో సుమారుగా 8.2 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 68 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక మిగితా దేశాల్లో ఈ సినిమా మరో 4 మిలియన్ డాలర్లు అంటే 33 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లోనే 100 కోట్ల మైలురాయిని దాటేసిందని పేర్కొంటున్నారు.

Kalki 2898 AD Day 3 North America and Overseas Box Office Collections Prabhas movie crossed 100 crores

కల్కి మూవీ ఇప్పటికే 72 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువైన ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సినిమా కలెక్షన్లను, అలాగే హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను, అలాగే సలార్ సినిమా వసూళ్లను బ్రేక్ చేయడం రికార్డుగా మారింది.

More from Filmibeat

Read more about: kalki 2898 ad usa prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X