Kalki 32 Days Collections: షారుక్ రికార్డుకు ప్రభాస్ ఎసరు.. జవాన్ లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటేసిన కల్కి!
ఇండియన్ సినిమా రంగంలో ఎపిక్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ చిత్రం నాలుగో వారంలో కూడా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తున్నది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తున్నది. ఈ సినిమా 32వ రోజున దాటిన మైలురాయి వివరాల్లోకి వెళితే..
కల్కి చిత్రం 32వ రోజున కూడా హిందీ వెర్షన్ ఉత్తరాదిలో రఫ్ ఆడించింది. ఈ సినిమా ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, చంఢీగడ్, లక్నో,పూణే,ఢిల్లీ లాంటి నగరాల్లో సుమారుగా 60 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీని రాబట్టాయి. ఓవరాల్‌గా ఇండియాలో 50 నుంచి 55 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

కల్కి చిత్రం ఆదివారం సెలవు దినాన్ని పూర్తిగా సద్వినియోగం చేసింది. ప్రేక్షకులను, రిపీట్ ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పించడంలో సక్సెస్ అయింది. ఈ చిత్రం ఇండియాలో 4 కోట్ల రూపాయలు నెట్, 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల నెట్, 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక గత 32 రోజుల్లో కల్కి సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తెలుగు వెర్షన్ 370 కోట్ల గ్రాస్ వసూళ్లు 185 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. ఇక హిందీ వెర్షన్ ఇప్పటి వరు 340 కోట్ల రూపాయల గ్రాస్,280 కోట్ల రూపాయల నికరంగా, తమిళంలో 70 కోట్ల గ్రాస్ 45 కోట్ల నికరంగా, మలయాళంలో 60 కోట్ల గ్రాస్ 45 కోట్ల షేర్, కన్నడలో 71 కోట్ల గ్రాస్ 35 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 1150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాట్టింది.

ఇక కల్కి చిత్రం నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో రికార్డు వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం అమెరికా, కెనడాలో కలిపి 19 మిలియన్ డాలర్లకు చేరువైంది. ఇక ఓవర్ససీస్ మొత్తం ఈ చిత్రం 33 మిలియన్ డాలర్లు అంటే 276 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 1187 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇప్పటి వరకు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద టాప్ కలెక్షన్లను సాధించిన ఇండియన్ సినిమాల విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం 2024 కోట్లతో మొదటి స్థానంలో, బాహుబలి 1810 కోట్లు, RRR 1236 కోట్లు, కేజీఎఫ్2 1235 కోట్ల రూపాయలు, కల్కి 1187 కోట్లు, జవాన్ 1162 కోట్ల రూపాయలతో 6వ స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications











