Kalki 2898 AD Day 4 Collections బాక్సాఫీస్‌పై ప్రభాస్ దండయాత్ర.. కల్కి మూవీకి 500 కోట్ల కలెక్షన్లు!

ఇండియన్ లెజెండ్స్, సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, ప్రభాస్, దీపిక పదుకోన్, దిశా పటానీ లాంటి నటుల మేలి కలయికతో రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల దండయాత్ర చేస్తున్నది. వైజయంతీ మూవీస్ ఏర్పాటు జరిగి 50 ఏళ్లు పూర్తి చేసుకొంటున్న నేపథ్యంలో సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఇండియన్ సినీ రంగంలో రికార్డులు తిరగరాస్తున్నది. ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

600 కోట్ల రూపాయలతో
భారతీయ పురాణం, టెక్నాలజీ యుగాన్ని జోడించి రూపొందించిన ఫిక్షన్ థ్రిల్లర్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను 600 కోట్ల రూపాయలతో లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 380 కోట్ల రూపాయలు జరిగింది. దాదాపు 382 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ చిత్రం కలెక్షన్ల వేట ప్రారంభించింది.

Kalki 2898 AD Day 4 Expected Box Office Collections Worldwide Prabhas movie inching towards 400 Crores

తెలుగు రాష్ట్రాల్లో
ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తొలి రోజు 66 కోట్ల రూపాయలు, రెండో రోజు 29 కోట్ల రూపాయలు, మూడో రోజు 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే ఈ చిత్రం మూడు రోజుల్లోనే 121 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 180 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది.

హిందీలో కలెక్షన్లు
ఇక హిందీలో తొలి రోజు 23 కోట్లు, రెండో రోజు 23 కోట్లు, మూడో రోజు 26 కోట్ల రూాపయలును వసూలు చేసింది. దాంతో మూడు రోజుల్లో 72 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక తమిళంలో తొలి రోజు 5 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.5 కోట్లు, మూడో రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 13.5 కోట్లు వసూలు చేసింది.

Kalki 2898 AD Day 4 Expected Box Office Collections Worldwide Prabhas movie inching towards 400 Crores

కేరళ, కర్ణాటకలో
ఇక మలయాళం, కన్నడ రంగాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. మలయాళంలో మొదటి రోజు 2.5 కోట్లు, రెండో రోజు 2 కోట్లు, మూడో రోజు 2.5 కోట్లు వసూలు చేసింది. ఇక కన్నడలో ఈ చిత్రం తొలి రోజు 12 కోట్లు, రెండో రోజు 4 కోట్లు, మూడో రోజు 7 కోట్లు వసూలు చేయడంతో మొత్తంగా 21 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

4వ రోజు కలెక్షన్లు ఎలా అంటే?
ఇక నాలుగో రోజు ఇండియాలో అంటే.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి ఈ చిత్రం 90 నుంచి 95 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని తెలిపింది. తెలుగులో నాలుగో రోజు 45 నుంచి 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kalki 2898 AD Day 4 Expected Box Office Collections Worldwide Prabhas movie inching towards 400 Crores

500 కోట్ల మైలురాయిని దాటి..
కల్కి చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా 3 రోజుల్లోనే సుమారుగా 415 కోట్ల గ్రాస్ వసూళ్లను 200 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. ఇక 4వ రోజు ఈ మూవీ 110 నుంచి 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో ఈ సినిమా 500 కోట్ల క్లబ్‌లో చేరి.. 530 కోట్లు నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X