Kalki Day 4 Overseas Collections: యూఎస్‌లో కల్కి కలెక్షన్ల సంచలనం.. 4వ రోజు ప్రభాస్ రేర్ రికార్డు
మహాభారతం కాలాన్ని, ఫ్యూచర్ జనరేషన్‌ను కనెక్ట్ చేసి తెరకెక్కించిన వెండితెర దృశ్యకావ్యం కల్కి 2898 ఏడీ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నది. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతకంతకు రికార్డులు క్రియేట్ చేస్తున్నది. నాగ్ అశ్వీన్, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాల ఊహకు అందని విధంగా బాక్సాఫీస్ సునామీని క్రియేట్ చేస్తున్నది. గత 4 రోజుల ఉత్తర అమెరికా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
నార్త్ అమెరికాలో రిలీజ్ చేసిన డిస్టిబ్యూటర్ అధికారికంగా ప్రకటనను విడుదల చేసి.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆదరణ, తెలుగు సినిమాను ఆదరించే ప్రేక్షకుల సహకారంతో కల్కి 2898 ఏడీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా అందిస్తున్న అనుభూతిని ప్రేక్షకులు నీరాజనం పట్టడమే ఈ కలెక్షన్లకు ప్రతీ రూపం అని తెలిపారు.

ఉత్తర అమెరికాలో అంటే.. అమెరికా, కెనడాలో కల్కి చిత్రం కలెక్షన్లు భారీ తుఫాన్‌ను తలపిస్తున్నాయి. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులన్నింటిని తిరగరాస్తున్నది. ఈ సినిమా అమెరికాలో 10 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో సుమారుగా 83 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
ఇక అమెరికాలో కాకుండా యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, గల్ఫ్, యూఏఈలో ఈ సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ కాకుండా మిగితా దేశాల్లో 4 మిలియన్ల డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 33 కోట్ల రూపాలయు రాబట్టింది.

దాంతో ఈ సినిమా నాలుగు రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్‌లో అరుదైన మైలురాయిని దాటింది. ఈ మూవీ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరడం ఈ సినిమా బాక్సాఫీస్ స్టామినాకు అద్దం పట్టింది. ఈ సినిమా ఇంకా బలంగా కలెక్షన్లను రాబట్టడంతో మరిన్నీ రికార్డులు తిరగరాసే అవకాశం ఉంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్ కలిసి రూపొందించిన కల్కి చిత్రం ఓవర్సీస్ రైట్స్ ఫ్యాన్సీ రేట్‌కు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను సుమారుగా 70 కోట్ల రూపాయలకు తీసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించినట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











