Kalki 2898 AD Day 5 Collections 600 కోట్ల మైలురాయిని దాటేసిన కల్కి.. 5వ రోజు ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వరదను పారిస్తున్నది. వర్కిండే, హాలీడే అనే తేడా లేకుండా ఈ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ చిత్రం ఇప్పటికే ప్రతీ చోట కోట్ల రూపాయల వర్షాన్ని కురిపిస్తున్నది. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల విషయాల్లోకి వెళితే..
ఓవర్సీస్‌లో కల్కి చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 12 మిలియన్ డాలర్లకు చేరువైంది. ఈ సినిమా అమెరికాలో ఓ చరిత్రను సృష్టించింది. వరుసగా 5 రోజుల్లో ఒక్కో రోజు ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లు రాబట్టడం ఓ రికార్డుగా క్రియేట్ అయింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి సంఘటన జరగలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఇప్పటి వరకు జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనే భారీ వసూళ్లు రాబట్టిందనే విషయం సంచలనం రేపింది. ఇప్పుడు రష్యాలో కూడా 1.24 మిలియన్ రష్యన్ రూబుల్స్ అంటే.. సుమారుగా 1 కోటి రూపాయలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఐదో రోజ కూడా బాక్సాఫీస్‌పై ప్రభాస్ దండయాత్ర సాగింది. తెలుగులో 15 కోట్ల రూపాయలు, తమిళంలో 2 కోట్ల రూపాయలు, కన్నడలో 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.5 కోట్ల రూపాయలు రాబడుతుందని వెల్లడించారు.
ఇక 5వ రోజు ఇండియా కలెక్షన్ల విషయానికి వస్తే.. అన్ని భాషల్లో కలిపి 40 కోట్ల రూపాయలు.. హిందీలో 17 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని వెల్లడించారు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు రాబడుతుందని చెప్పారు.
ఇక కల్కి చిత్రం గత 4 రోజుల్లో 551 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక 5వ రోజు కలెక్షన్లతో కలిపి ఈ మూవీ 600 కోట్ల మైలురాయిని దాటేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. అన్ని భాషల్లో ఈ చిత్రం 330 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. హిందీలో 121 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో సుమారుగా 160 కోట్ల గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











