Kalki 2898 AD Day 6 Collections కల్కికి 700 కోట్ల కలెక్షన్లు.. 6వ రోజు కూడా వసూళ్ల కుంభవృష్టి!

ఇండియన్ స్క్రీన్‌పై ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ రూపొందించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ చిత్రం 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కల్కి 6వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ చిత్రం తాజా సమాచారం ప్రకారం.. తెలుగులో 11.5 కోట్లు, తమిళంలో 1.5 కోట్లు, హిందీలో 14 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు.

Kalki 2898 AD Day 6 Expected Box Office Collections Worldwide Prabhas movie Racing toward 700 Crores

ఇండియాలో వివిధ భాషల్లో కల్కి చిత్రం నిలకడగానే కాకుండా బ్రహ్మండమైన వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రికార్డులు తిరగ రాసింది. తెలుగులో 200 కోట్ల రూపాయలు, తమిళంలో 21 కోట్ల రూపాయలు, హిందీలో 145 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 35 కోట్ల రూపాయలు, కేరళలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం ఆరో రోజు కూడా రికార్డు లెవెల్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. 6వ రోజున ఇతర సినిమాలు సాధించిన వసూళ్ల కంటే ఎక్కువగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇండియా వైడ్ ఈ చిత్రం 28 కోట్ల రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 45 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేస్తుందని వెల్లడించారు.

Kalki 2898 AD Day 6 Expected Box Office Collections Worldwide Prabhas movie Racing toward 700 Crores

కల్కి చిత్రం గత 5 రోజుల్లో వసూళ్ల తుఫాన్‌ను మరిపించింది. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 625 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 6వ రోజు కలెక్షన్లను కలిపితే ఈ మూవీ 670 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక కలెక్షన్లు పెరిగితే ఈ చిత్రం 700 కోట్లకు సమీపంలో స్థిరపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X